‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రాన్ని ట్రిపుల్ బ్లాక్‌బస్టర్ చేసిన ఆడియెన్స్‌కు థ్యాంక్స్ చెప్పారు వెంకటేష్. అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా సంక్రాంతికి విడుదలై బాక్సాఫీస్ వద్ద హౌస్‌ఫుల్ కలెక్షన్స్‌తో రికార్డు క్రియేట్ చేస్తోంది.
ఇప్పటికి రూ.230 కోట్ల గ్రాస్ వసూళ్లు చేసిందని టీమ్ చెప్పింది. ఈ సందర్భంగా గురువారం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో వెంకటేష్ మాట్లాడుతూ ‘సంక్రాంతికి హానెస్ట్‌గా ఓ ఫ్యామిలీ సినిమా ఇవ్వాలని అనుకున్నాం. కానీ ఆడియెన్స్ నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్లారు. చాలా సపోర్ట్, ఎంకరేజ్‌మెంట్ ఇచ్చారు. సినిమా చేస్తున్నప్పుడే పాజిటివ్ ఎనర్జీ ఉండేది. రిలీజ్ తర్వాత కూడా అదే కంటిన్యూ అవుతోంది’అని చెప్పారు.
అనిల్ రావిపూడి మాట్లాడుతూ ‘మేం ఊహించిన దానికంటే అద్భుతమైన రెస్పాన్స్, రెవెన్యూ రావడం చాలా హ్యాపీగా ఉంది. వచ్చిన ప్రతి రూపాయి ప్రేక్షకుడి నవ్వుతో రావడం మరింత ఆనందంగా ఉంది. ఈ సక్సెస్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది’ అని అన్నాడు. ఈ విజయంలో తాను భాగమవడం సంతోషాన్ని ఇచ్చిందని మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో చెప్పాడు.