హీరోయిన్ తో డైరెక్టర్ అనిల్ రావిపూడి కెమిస్ట్రీ.. సైబర్ క్రైమ్ పోలీసులకి కంప్లైంట్..

హీరోయిన్ తో డైరెక్టర్ అనిల్ రావిపూడి కెమిస్ట్రీ..  సైబర్ క్రైమ్  పోలీసులకి కంప్లైంట్..

టాలీవుడ్ లో 100% శాతం సక్సెస్ రేట్ ఉన్న దర్శకులలో ప్రముఖ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఒకరు. ఇప్పటివరకూ అనిల్ రావిపూడి తీసిన సినిమాలన్నీ దాదాపుగా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. అయితే ఈమధ్య కొందరు వ్యూస్ కోసం చేసే తప్పుడు ప్రచారాల కారణంగా సినీ సెలెబ్రెటీలు చిక్కుల్లో పడుతున్నారు. డైరక్టర్ అనిల్ రావిపూడి ఓ హీరోయిన్ విషయంలో ఇటీవలే సైబర్ క్రైం పోలీసులని ఆశ్రయించాల్సి వచ్చింది. 

ఇంతకీ అసలు విషయం ఏమిటంటే ఇటీవలే  అనిల్ రావిపూడి ఓ సినిమా ప్రమోట్ చేసేందుకు వెళ్ళాడు. ఈ క్రమంలో యాంకర్ మాట్లాడుతూ మీ నెక్ట్స్ సినిమాలో కూడా హీరోయిన్ మీనాక్షి చౌదరిని కంటిన్యూ చెయ్యండి.. మీకు ఆమెకి మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది అంటూ సరదాగా కామెంట్లు చేసింది. దీంతో కొందరు వ్యూస్ కోసం ఈ కామెంట్లని వక్రీకరించి ఫేక్ థంబ్ నెయిల్స్ పెడుతూ వీడియోలు, మీమ్స్ షేర్ చేస్తున్నారు. 

దీంతో కొందరు అనిల్ రావిపూడి బంధువులు ఈ వీడియోలని తన భార్యకి షేర్ చేస్తున్నారట. చివరికి ఈనోటా ఆ నోటా పాకుతూ అనిల్ రావిపూడి చెవిన పడింది. దీంతో వెంటనే అనిల్ రావిపూడి సైబర్ క్రైమ్ పోలీసులని సంప్రదించి ఫిర్యాదు చేశాడు.. అలాగే తాను ప్రశాంతంగా సినిమాలు చేసుకుంటున్నానని తనకెలాంటి కెమిస్ట్రీలు లేవని క్లారిటీ ఇచ్చాడు. 

ALSO READ : Rambha: రీ ఎంట్రీకి రెడీ అవుతున్న వెటరన్ హీరోయిన్.. ఈసారి క్లిక్ అవుతుందా..?

అలాగే తన గురించి కెమిస్ట్రీ వీడియోలు షేర్ చేసిన వారిని వీడియోలు తొలగించాలని లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించాడు. కొందరు నెటిజన్లు ఈ విషయం గురించి స్పందిస్తూ ఒకే సినిమాలో కలసి పని చేసినంత మాత్రాన హీరోయిన్, డైరెక్టర్ మధ్య ఎదో ఉందంటూ ప్రచారాలు చెయ్యడం సరికాదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

ఈ విషయం ఇలా ఉండగా ఈ ఏడాది "సంక్రాంతికి వస్తున్నాం" సినిమాతో  అనిల్ రావిపూడి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమా దాదాపుగా రూ.300 కోట్లు పైగా కలెక్ట్ చేసింది. ప్రస్తుతం ఈ సినిమా ప్రముఖ ఓటిటి జీ5 లో అందుబాటులో ఉంది.