దర్శకుడిగా 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మీడియాతో డైరెక్టర్ అనిల్ రావిపూడి (AnilRavipudi) మాట్లాడారు. ఈ స్పెషల్ చిట్ చాట్ వేదికగా అనిల్ తన కొత్త సినిమాల విశేషాలు పంచుకున్నారు. ఈ పదేళ్ల వ్యవధిలో తన నుంచి 8 సినిమాలొచ్చాయి. ఆ సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర విజయాలు సాధించాయి. ఈ క్రమంలో వెంకటేష్తో చేసిన అనిల్ 8వ మూవీ సంక్రాంతికి వస్తున్నాంతో ఇండస్ట్రీ హిట్ అందుకున్నారు.
ఈ నేపథ్యంలో నిర్వహించిన మీడియా చిట్ చాట్ లో భాగంగా అనిల్ పలు విశేషాలు పంచుకున్నారు. తన నెక్స్ట్ సినిమాలపైన అనిల్ మాట్లాడారు. మెగాస్టార్ చిరంజీవితో చేసిన సినిమా గురించి మాట్లాడుతూ.." చిరంజీవి సినిమా గురించి మాట్లాడడం టూ ఎర్లీ అవుతుంది. ఇప్పటికీ కనీసం ఇటుకలు వేసి బేస్ కూడా వేయలేదు, జస్ట్ ఇంకా టాక్స్ లోనే ఉన్నాం. ఎలాంటి జానార్ చేయాలి? ఎలాంటి సెటప్లో చేయాలి? సంక్రాంతికి వస్తున్నాం వంటి బ్లాక్ బాస్టర్ సినిమా తర్వాత వస్తున్న సినిమా కాబట్టి నేను ఇంకెలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని ఆలోచనలో ఉన్నట్లు అనిల్ తెలిపాడు.
Also Read :- పుష్ప 2 ఓటీటీ అప్డేట్ .. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
అలాగే, చిరంజీవి లాంటి ఒక స్టార్ ఇమేజ్ ఉన్న నటుడికి ఎలాంటి జోనర్ సినిమా చేయాలి? అయన ఇప్పటివరకు టచ్ చేయని అంశం ఏదైనా ఉందా? అని ఆలోచిస్తున్నాం అన్నారు అనిల్. అంతేకాకుండా చిరుతో తీయబోయే సినిమా ఊహించిన దానికంటే 100% మించి ఉంటుందనే విషయాన్ని మాత్రం చెప్పగలను అంటూ అనిల్ రావిపూడి చెప్పుకొచ్చారు. ఇకపోతే హీరో నాగార్జునతో సైతం ఫ్యూచర్ లో సినిమా చేసే ఛాన్స్ ఉన్నట్లు అనిల్ రావిపూడి తెలిపాడు.
ప్రస్తుతం బింబిసారా ఫేమ్ వశిష్ట డైరెక్షన్‌లో చిరంజీవి ‘విశ్వంభర’ చేస్తున్నాడు. ఇటీవల ‘దసరా’ దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతోనూ మరో సినిమా ప్రకటించాడు. ఇక ఇదే ఊపులో అనిల్ రావిపూడితోనూ మూవీ చేయడానికి చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే ‘విశ్వంభర’ పూర్తవ్వగానే చిరు తన నెక్స్ట్ మూవీని అనిల్ తో స్టార్ట్ చేస్తాడా? శ్రీకాంత్ తో చేస్తాడా? అనేది క్లారిటీ రావాల్సి ఉంది.
చిరంజీవి వింటేజ్ సినిమాలు గ్యాంగ్ లీడర్, ఘరానా మొగుడు, రౌడీ అల్లుడు తరహాలో సరికొత్త మాస్ క్యారెక్టరైజేషన్‌ను డిజైన్ చేస్తున్నట్టు ఇదివరకే అనిల్ తెలిపాడు. ఇక లేటెస్ట్ అనిల్ కామెంట్స్ తో ఈ కాంబోపై అంచనాలు మొదలయ్యాయి. ఏదేమైనా సీనియర్ హీరోల బలాలు తెలిసిన అనిల్ కి చిరుతో ఊహకి మించిన కథతో రావడంలో ఎలాంటి సందేహం లేదు.
అనిల్ రావిపూడి లేటెస్ట్ ఫిల్మ్.. సంక్రాంతికి వస్తున్నాం బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. రెండో వారంలోనూ అదరగొడుతోంది. జనవరి 14న రిలీజైన ఈ మూవీ భారీ కలెక్షన్లను సాధిస్తోంది. వారంలోనే రూ.రూ.218 కోట్ల గ్రాస్ కలెక్షన్ల మార్క్ దాటి సంచలనం సృష్టించింది. ఈ వీకెండ్ లో రిపబ్లిక్ డే కూడా ఉండటంతో కలెక్షన్స్ అమాంతం పెరిగే ఛాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.
Block Buster Director @AnilRavipudi #AnilRaviPudi Interacts With Media On 10 Years Of Cinematic Journey 💯🏆💐 #SankranthikiVasthunnam pic.twitter.com/RTGDlaQyW5
— BA Raju's Team (@baraju_SuperHit) January 22, 2025