ఫ్యామిలీస్ నా బలం.. వినోదం నా ఆయుధం

ఫ్యామిలీస్ నా బలం.. వినోదం నా ఆయుధం

సరిగ్గా పదేళ్ల క్రితం ఇదే రోజున ‘పటాస్‌‌’ విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.  అది మొదలు వరుస విజయాలతో దూసుకెళ్తున్నాడు దర్శకుడు అనిల్ రావిపూడి. ఇటీవల ‘సంక్రాంతికి వస్తున్నాం’తో ఎనిమిదో విజయాన్ని అందుకుని తన విజయ పరంపరను కొనసాగించాడు. ఈ నేపథ్యంలో తన పదేళ్ల సినీ ప్రయాణం గురించి అనిల్ రావిపూడి ఇలా ముచ్చటించాడు.. 

‘‘దర్శకుడు అవ్వాలనేది నా డ్రీమ్.  ‘పటాస్‌‌’తో అది తీరిపోయింది. ఇదంతా బోనస్.  నాకు లైఫ్​ ఇచ్చింది ప్రేక్షకులు. వాళ్లకు పైసా వసూల్ ఎంటర్‌‌‌‌టైన్మెంట్‌‌ ఇవ్వడమే నా లక్ష్యం. దాన్నే కొనసాగిస్తున్నా. ఈ పదేళ్లు ఒక అద్భుతమైన ప్రయాణం.  కళ్యాణ్ రామ్ గారు లేకపోతే నా కెరీర్‌‌‌‌ లేదు. నిర్మాతగా ‘పటాస్‌‌’ తీసి ఆయన నన్ను దర్శకుడిగా నిలబెట్టారు. అందుకే ఈ పదేళ్ళ క్రెడిట్ ఆయనకే ఇస్తాను.  ప్రతి  చిత్రం ఒక మెమరబుల్ ఎక్స్‌‌పీరియన్స్. ప్రతి హీరోతోనూ గొప్ప రిలేషన్. నేను సినిమాలు చూస్తూ విజిల్స్ కొట్టిన హీరోలతో కలిసి పనిచేయడం అల్టిమేట్ ఫీలింగ్. అలాగే  నా ప్రతి సినిమాకు ఒక్కో మెట్టు ఎక్కిస్తూ ‘సంక్రాంతికి వస్తున్నాం’తో మరో అద్భుత విజయాన్ని అందించారు ప్రేక్షకులు. ఈ విక్టరీ నా కెరీర్‌‌‌‌లో హిస్టరీ. ఈ క్రెడిట్ అంతా ప్రేక్షకులదే.  ఫ్యామిలీ జానర్ నా స్ట్రెంత్. ఎంటర్‌‌‌‌టైన్మెంట్ ప్రేక్షకులు నాకు ఇచ్చిన వెపన్. దాన్ని లైఫ్‌‌ లైన్‌‌గా ఎప్పుడూ వాడుకుంటా. 

పదేళ్ల కెరీర్‌‌‌‌లో ప్రేక్షకుల ప్రేమను సంపాదించుకోగలిగాను. అంతకు మించిన  ఆస్తి ఏముంటుంది.  అలాంటి ప్రేక్షకులకు అతి దగ్గరగా ఉండే కథలు రాసుకోవడమే నా సక్సెస్ సీక్రెట్.  నా నుంచి వాళ్లు ఏం కోరుకుంటున్నారు, నా బలం ఏమిటి అనేది అనలైజ్ చేస్తా. గత చిత్రానికి సంబంధించిన పాత్రల ప్రభావం పడకుండా జాగ్రత్త పడతాను. ఆటోమాటిక్‌‌గా సినిమా ఫ్రెష్‌‌గా వస్తుంది.  జంధ్యాల గారి సినిమాలు నాకు చాలా ఇష్టం. ‘సంక్రాంతికి వస్తున్నాం’లోని బుల్లిరాజు పాత్రకు ‘హై హై నాయక’ సినిమాలోని సీన్ స్ఫూర్తి. దాన్ని దృష్టిలో ఉంచుకునే ప్రస్తుత ఓటీటీ ట్రెండ్‌‌లో బుల్లిరాజు పాత్రను డిజైన్ చేశాను.  ప్రేక్షకులు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు.  చిరంజీవి గారి సినిమా ఏ జానర్‌‌‌‌లో చేద్దామనే విషయంపై చర్చలు జరుగుతున్నాయి. అందరి ఊహకు మించి ఆయన్ను ప్రజెంట్ చేయాలనే విల్ పవర్‌‌‌‌తో ఉన్నాను.  అలాగే నాగార్జున గారితో ‘హలో బ్రదర్‌‌‌‌’ లాంటి సినిమా చేయాల నుంది. అది కూడా అయితే నలుగురు అగ్రహీరోలతోనూ  సినిమాలు చేశాననే రికార్డ్‌‌ నాకు ఉంటుంది’’.