ఒకరు మాస్, ఒకరు క్లాస్. ఒకరు తొడగొట్టి ఆడియన్స్ కు కిక్కిస్తే, మరొకరు కామెడీ టైమింగ్ తో కుమ్మేస్తారు. ఒకరు మాస్ కి డెఫినేషన్, మరొకరు క్లాస్ కి కేరాఫ్. ఆ హీరోలు మరెవరో కాదు నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna), విక్టరీ వెంకటేష్(Victory Venkatesh). ఈ కాంబోలో సినిమా వస్తే ఎలా ఉంటుంది. బాక్సాఫీస్ బద్దలే కదా. సరిగ్గా ఇలాంటి ఆలోచనే దర్శకుడు అనిల్ రావిపూడికి వచ్చిందట. అందుకే ఈ క్లాస్, మాస్ కంబోను సెట్ చేసే పనిలో పడ్డారట. ప్రస్తుతం ఈ న్యూస్ టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
నిజానికి ఈ ఇద్దరి హీరోలతో దర్శకుడు అనిల్ కి మంచి ర్యాపో ఉంది. ఈ ఇద్దరికీ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్స్ అందించాడు. బాలకృష్ణతో ఇటీవలే భగవంత్ కేసరి లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన అనిల్.. వెంకటేష్ కి F2, F3 సినిమాలతో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్స్ అందించాడు. దాంతో తన నెక్స్ట్ సినిమా కోసం ఈ ఇద్దరినీ ఫిక్స్ చేసుకున్నాడట. తన గత చిత్రాల మాదిరిగానే ఈ సినిమా కోసం కూడా ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్ కథనే ఎంచుకున్నాడట అనిల్. ఈ క్రేజీ కాంబోలో వస్తున్న సినిమాకు సంక్రాంతి వస్తున్నాం అనే టైటిల్ ఫిక్స్ చేశాడట. త్వరలోనే అధికారిక ప్రకటన రానున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుందని సమాచారం.
ప్రస్తుతం బాలకృష్ణ దర్శకుడు బాబీ కొల్లితో ఓ మాస్ సినిమా చేస్తున్నాడు. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమా కంప్లీట్ అయిన వెంటనే అనిల్ సినిమా సెట్స్ లో అడుగుపెట్టనున్నాడట బాలయ్య. మరి మాస్ అండ్ క్లాస్ క్రేజీ కాంబోలో రానున్న ఈ సినిమా ఎలాంటీ విజయాన్ని అందుకుంటుందో చూడాలి.