నేను చిరంజీవితో సినిమా చేయలేను.. యంగ్ డైరెక్టర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

నేను చిరంజీవితో సినిమా చేయలేను.. యంగ్ డైరెక్టర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

దర్శకుడు అనిల్ విశ్వనాథ్(Anil Vishwanath) తెరకెక్కించిన లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ పొలిమేర2(Polimera2). ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ హారర్ అండ్ థ్రిల్లర్ మూవీ ఆడియన్స్ నుండి సూపర్ హిట్ టాక్ ను తెచ్చుకుంది. దైవం, చేతబడి కాన్సెప్ట్ తో వచ్చిన ఈ మూవీలో సత్యం రాజేష్, రాకేందు మౌళి, గెటప్ శ్రీను, బాలాదిత్య ప్రధాన పాత్రల్లో నటించారు. డైరెక్ట్ ఓటీటీలో వచ్చి బ్లాక్ బస్టర్ గా నిలిచినా పొలిమేర సినిమాకు సీక్వల్ గా వచ్చిన ఈ సినిమాపై ఆడియన్స్ లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలను అందుకోవడంలో సక్సెస్ సాధించింది ఈ సినిమా. 

దీంతో ఈ సినిమా దర్శకుడు అనిల్ విశ్వనాథ్ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా సినిమా గురించి, తన పర్సనల్ లైఫ్ గురించి చాలా ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చాడు అనిల్. ఇంటర్వ్యూలో భాగంగా యాంకర్ అనిల్ ను చిరంజీవితో సినిమా చేస్తారా? ఇప్పుడు ఆయన యంగ్ డైరెక్టర్ కిక్ ఛాన్స్ ఇస్తున్నారు కదా? ఆయనతో సినిమా చేసే ఐడియా ఏమైనా ఉందా? అని అడిగారు. 

దానికి సమాధానంగా అనిల్ మాట్లాడుతూ.. నేను చిన్నప్పటినుండి చిరంజీవికి చాలా పెద్ద ఫ్యాన్. ఆయనంటే అదోరకమైన పిచ్చి. ఆయనతో సినిమా అంటే నేను చేయలేను. అంతకంటే.. ఆయన నా సినిమా చూసి నా భుజంపై చేసి వేసి చాలాబాగా చేశావ్ రా అంటే చాలు.. అదే నాకు ఎక్కువ. ఇంకా ఆయనతో సినిమా చేయడమా? అంటూ చిరంజీవిపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు దర్శకుడు అనిల్ విశ్వనాథ్. ప్రస్తుతం అనిల్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

ALSO READ :- విషాదం.. తాత కారుకింద పడి రెండేళ్ల మనవడు మృతి