Vishwak, Anudeep: ఇది కిరాక్ కాంబో.. విశ్వక్తో అనుదీప్ మూవీ

Vishwak, Anudeep: ఇది కిరాక్ కాంబో.. విశ్వక్తో అనుదీప్ మూవీ

టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో క్రేజీ కాంబో సెట్ అయ్యిందా అంటే. అవుననే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఆ కాంబో మరేదో కాదు మాస్ కా దాస్ విశ్వక్ సేన్, ఎంటర్టైన్మెంట్ కి కేరాఫ్ అనుదీప్. అవును.. ఈ ఇద్దరి కాంబోలో ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ మూవీ రానుందట. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ ఫోర్టీన్ రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ పథకంపావు రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ఈ సినిమాను నిర్మించనున్నారని సమాచారం, త్వరలోనే ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన రానుంది. 

ఇక మాస్ హీరో విశ్వక్ విషయానికి వస్తే.. ఇటీవల ఆయన హీరోగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా వచ్చిన విషయం తెలిసిందే. దర్శకుడు కృష్ణ చైతన్య తెరకెక్కించిన ఈ సినిమా అనుకున్నంత సక్సెస్ కాలేకపోయింది. ఆయన గత చిత్రం గామి కూడా సీరియస్ సినిమా కావడంతో విశ్వక్ కూడా ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ మూవీ చేయాలనీ చేస్తున్నాడట. ఇందులో భాగంగానే దర్శకుడు అనుదీప్ అదిరిపోయే లైన్ ఒకటి చెప్పాడట. అది నచ్చడంతో వెంటనే ఒకే చెప్పేశాడట విశ్వక్. 

ఇక అనుదీప్ విషయానికి వస్తే.. జాతిరత్నాలు సినిమాతో బిగ్గెస్ట్ హిట్ అనుకున్న అనుదీప్.. ఆ తరువాత తమిళ హీరో శివ కార్తికేయన్ తో ప్రిన్స్ సినిమా చేశాడు. ఆ సినిమా ప్లాప్ గా నిలిచింది. ఆ తరువాత విక్టరీ వెంకటేష్ తో, రవితేజ తో అనుదీప్ సినిమా చేస్తున్నాడనే వార్తలు ఇండస్ట్రీలో వైరల్ అయ్యాయి. కానీ, సడన్ గా విశ్వక్ ఫైనల్ అయ్యాడని తెలుస్తోంది. ఈ సినిమా కూడా అనుదీప్ స్టైల్లోనే పక్కా కామెడీ ఎంటర్టైనర్ గా ఉంటుందని టాక్. మరి ఈ సినిమాతో ఈ ఇద్దరు ఎలాంటి విజయాలు అందుకోనున్నారో చూడాలి.