
బ్రాహ్మణ సమాజంపై తాను చేసిన అసభ్యకర వ్యాఖ్యలకు బాలీవుడ్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ అనురాగ్ కశ్యప్ క్షమాపణలు చెప్పారు. అయితే కొద్ది రోజుల కిందట అనురాగ్ కశ్యప్ బ్రాహ్మణులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు.
'ఫూలే' సినిమాపై చర్చ జరుగుతున్న సమయంలో ఓ నెటిజన్ కు సమాధానం ఇస్తూ " బ్రాహ్మణులపై మూత్ర విసర్జన చేస్తాను.. నీకేమైనా సమస్యా?" అంటూ కులతత్వ వ్యాఖ్యలు చేశారు. దీనిపై దేశంలోని వివిధ ప్రాంతాల్లో నిరసనలు, ఎఫ్ఐఆర్‌లు వెల్లువెత్తడంతో అనురాగ్ కశ్యప్ ఇప్పుడు క్షమాపణలు చెప్పాడు. తన తప్పును గ్రహించానని, తన హుందాతనాన్ని మరచిపోయి కోపంతో తన పరిమితులను దాటినట్లు ఒప్పుకున్నాడు. చివరికి మొత్తం సమాజాన్నే కించపరిచానని అనురాగ్ కశ్యప్ అంగీకరించాడు.
Also Read : పెళ్లిరోజే పండంటి బిడ్డకు జన్మనిచ్చిన విష్ణు విశాల్, జ్వాలా గుత్తా దంపతులు
నేడు ఏప్రిల్ 22న అనురాగ్ కశ్యప్ X వేదికగా క్షమాపణలు చెబుతూ పోస్ట్ పెట్టాడు. " కోపంలో, నేను ఎవరికైనా సమాధానం చెప్పేటప్పుడు నా పరిమితులను మరచిపోయాను. నేను మొత్తం బ్రాహ్మణ సమాజం గురించి చెడుగా మాట్లాడాను. నా జీవితంలో చాలా మంది బ్రాహ్మణ వ్యక్తులు ఉన్నారు. నేడు, వారు నా వల్ల బాధపడ్డారు. నేను గౌరవించే చాలా మంది మేధావులు నాపై కోపం పెంచుకున్నారు.
मैं गुस्से में किसी को एक जवाब देने में अपनी मर्यादा भूल गया। और पूरे ब्राह्मण समाज को बुरा बोल डाला। वो समाज जिसके तमाम लोग मेरी जिंदगी में रहे हैं, आज भी हैं और बहुत कॉन्ट्रीब्यूट करते हैं। आज वो सब मुझसे आहत हैं। मेरा परिवार मुझसे आहत है। बहुत सारे बुद्धिजीवी, जिनकी मैं इज्जत…
— Anurag Kashyap (@anuragkashyap72) April 22, 2025
అలాగే నా కోపం మరియు నేను మాట్లాడిన విధానం అందరినీ ఎంతో బాధపెట్టింది. ఈ సమాజానికి నా హృదయపూర్వక క్షమాపణలు కోరుతున్నాను. మాట్లాడే విధానం వల్ల బాధపడ్డ నా స్నేహితులందరికీ, నా కుటుంబానికి మరియు సమాజానికి క్షమాపణలు కోరుతున్నాను. ఇది మళ్ళీ జరగకుండా చూసుకుంటాను. నా కోపాన్ని నియంత్రించుకుంటాను. ఒకవేళ మాట్లాడాల్సి వచ్చినా.. సరైన పదాలనే వాడతాను. మీరు నన్ను క్షమిస్తారని ఆశిస్తున్నాను " అంటూ కశ్యప్ పోస్టులో క్షమాపణలు కోరాడు.
'ఫూలే' చిత్రం.. దళిత నాయకులు మరియు సామాజిక సంస్కర్తల జీవితాల ఆధారంగా రూపొందించబడింది. ప్రతీక్ గాంధీ మరియు పత్రలేఖ నటించిన ఈ చిత్రం కులతత్వాన్ని ప్రోత్సహిస్తుందని బ్రాహ్మణ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో సెన్సార్ బోర్డు కొన్ని కటింగ్స్ సూచించింది. దీనిపై డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ మొదట స్పందించాడు. ఇది ఏప్రిల్ 25న థియేటర్లలోకి రానుంది.