జవాన్(Jawan).. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్(Shah rukh khan) నటించిన ఈ మూవీ భారీ విజయాన్ని సాధించింది. తమిళ దర్శకుడు అట్లీ కుమార్(Atlee kumar) తెరకెక్కించిన ఈ సినిమాలో లేటెస్ట్ సూపర్ స్టార్ నయనతార(Nayanthara), బాలీవుడ్ క్వీన్ దీపికా పదుకొనె(Deepika padukone) హీరోయిన్స్ గా నటించారు. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కించిన ఈ సినిమా సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.
అయితే జవాన్ సినిమా విడుదల సమయంలో ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉంటుందని చెప్పారు అట్లీ. అంతేకాదు.. ఇటీవల జరిగిన ఒక అవార్డు ఫంక్షన్ లో జవాన్ సినిమాకు బెస్ట్ డైరెక్టర్ అవార్డు అందుకున్న అట్లీ ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. జవాన్ సినిమా నేను షారుఖ్ సార్ కి రాసిన ఫస్ట్ లవ్ లెటర్ లాంటిది. ఇక ముందుకూడా రాస్తూనే ఉంటాను అంటూ చెప్పుకొచ్చాడు. ఇటీవల మరో ఈవెంట్ లో పాల్గొన్న అట్లీ జవాన్ సీక్వెల్ గురించి స్పందించాడు.. జవాన్ సినిమా సీక్వెల్ గురించి ఇప్పుడు చెప్పలేను కానీ, ఖచ్చితంగా ఉంటుంది. సరికొత్త సర్ప్రైజ్ తో ఆడియన్స్ ముందుకు వస్తాను. ప్రస్తుతం జవాన్ సీక్వెల్ పనులు జరుగుతున్నాయి. ఇక షారుఖ్ లాంటి హీరోతో వర్క్ చేయడం నా అదృష్టం. ఆయనతో మళ్ళీ మళ్ళీ వర్క్ చేస్తాను.. అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో నెటిజన్స్.. షారుఖ్ కోసం రెండో లవ్ లెటర్ సిద్ధం చేస్తున్న అట్లీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇక అట్లీ విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో చేయబోయే సినిమాలో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు కు సంబందించిన కథ చర్చలు జారుతున్నాయని సమాచారం. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ భారీ సినిమా గురించి అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది. పుష్ప2 షూటింగ్ పూర్తి కాగానే అట్లీతో సినిమా చేయనున్నాడు అల్లు అర్జున్.