Ayan Mukerji: వార్ 2 డైరెక్టర్ అయాన్ ముఖర్జీ ఇంట్లో తీవ్ర విషాదం..

Ayan Mukerji: వార్ 2 డైరెక్టర్ అయాన్ ముఖర్జీ ఇంట్లో తీవ్ర విషాదం..

వార్ 2 మూవీ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ తండ్రి దేబ్ ముఖర్జీ 83 ఏళ్ళ వయసులో మరణించారు.  ఈరోజు (మార్చి 14న ) శుక్రవారం తుది శ్వాస విడిచారు. దేబ్ ముఖర్జీ గత రెండు నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. వృద్ధాప్య సంబంధిత వ్యాధుల కారణంగా ఈ ఉదయం మరణించినట్లు బాలీవుడ్ వర్గాలు తెలిపాయి.

ఆయన అంత్యక్రియలు శుక్రవారం సాయంత్రం 4:00 గంటలకు ముంబైలోని పవన్ హన్స్‌లో శ్మశానవాటికలో జరుగుతాయని కుటుంబ సభ్యులు ఓ ప్రకటలో తెలిపారు. అభినేత్రి , కామినే మొదలైన సినిమాల్లో ముఖర్జీ తన పాత్రలతో ప్రసిద్ధి చెందారు. 

దేబ్ ముఖర్జీ రెండుసార్లు వివాహం చేసుకున్నారు. ఆయన రెండవ వివాహం వల్ల పుట్టిన కుమారుడే డైరెక్టర్ అయాన్ ముఖర్జీ. అలాగే బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ ఐన కాజోల్ మరియు రాణి ముఖర్జీలిద్దరు ముఖర్జీకి మేనకోడళ్ళు అవుతారు.

ఇకపోతే, దేబ్ ముఖర్జీ అంత్యక్రియలకు కాజోల్, అజయ్ దేవగన్, రణబీర్ కపూర్, అలియా భట్, తనీషా, రాణి ముఖర్జీ, తనూజ, హృతిక్ రోషన్, సిద్ధార్థ్ మల్హోత్రా, దీపికా పదుకొనే, రణవీర్ సింగ్ మరియు ఇతర  ప్రముఖులు హాజరవుతారని సమాచారం.

ప్రస్తుతం అయాన్ ముఖర్జీ వార్ 2 మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఇందులో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ హీరోలుగా నటిస్తున్నారు. ప్రస్తుతం హృతిక్ రోషన్ మరియు ఎన్టీఆర్ లతో వార్ 2 షూటింగ్ షెడ్యూల్ పూర్తి చేసిన తర్వాత, అయాన్ బ్రహ్మాస్త్ర 2 ప్రీ-ప్రొడక్షన్ పనులను ప్రారంభించే అవకాశం ఉంది.