![Yellamma: ఎల్లమ్మ వచ్చేస్తోంది.. దర్శకుడు బలగం వేణు రెండో మూవీ అప్డేట్](https://static.v6velugu.com/uploads/2025/02/director-balagam-venu-latest-post-on-yellamma-movie_BCl3LfO4zh.jpg)
'వేణు యెల్డండి'.. ఈ పేరులో ఓ అరుదైన మట్టివాసన ఉందని తన మొదటి సినిమాతోనే తెలియజేశాడు. బలగం (Balagam) సినిమాతో అనూహ్య విజయాన్ని అందుకుని తన సత్తా చాటాడు.
బలగం సినిమాతో ఇండస్ట్రీ మొత్తాన్ని ఒక్కసారిగా తనవైపుకు తిప్పుకుని జబర్దస్త్ వేణు కాస్త బలగం వేణు (Balagam Venu) గా మారిపోయాడు. ఇప్పడీ డైరెక్టర్ తన రెండో సినిమాతో ప్రేక్షకులకు ముందుకు రానున్నాడు. అందుకు అంత సిద్ధం చేసుకుని బరిలో దిగనున్నాడు.
లేటెస్ట్గా డైరెక్టర్ బలగం వేణు తన సోషల్ మీడియా వేదికగా ఓ కొత్త ఫోటో షేర్ చేశారు. ఈ ఫొటోకు ఓ ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ జోడించాడు. "సిద్దమవుతున్నా.. త్వరలో అప్‌డేట్ ఇస్తున్నా" అంటూ జిమ్ లో కసరత్తు చేస్తున్న ఫోటో పంచుకున్నారు.
Also Read :- నితిన్కు విలన్‌గా.. ఆదిపురుష్ హనుమంతుడు
అంటే, ఈ ఫొటోలో కండలు తిరిగిన దేహంతో వేణు కనిపిస్తున్నాడు. దీంతో తన సినిమాలోనే వేణు ఓ కీలక పాత్ర చేయనున్నట్లు తెలుస్తోంది. మరి వేణు నుంచి వస్తోన్న సెకండ్ ప్రాజెక్ట్ అనౌన్స్ త్వరలోనే వచ్చే అవకాశం ఉంది. నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నాడు.
ఎల్లమ్మ:
తెలంగాణ మనుషులలో బాగా పాపులర్ అయిన పేరునే టైటిల్గా ఎంచుకున్నారు వేణు. కథని ఆధారంగా చేసుకుని డైరెక్టర్ వేణు 'ఎల్లమ్మ'(Yellamma) అనే టైటిల్ని ఫిక్స్ చేసినట్లు సమాచారం.
ఇందులో హీరోగా నితిన్ కనిపిస్తున్నాడు. నితిన్ కి జోడిగా సహజ నటి సాయి పల్లవిని ఎంచుకున్నాడట వేణు.అయితే, ఈ కథకి ముందుగా హీరో నాని నటిస్తున్నట్లు ముందునుంచి టాక్ వినిపించింది. కానీ, కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ నితిన్ దగ్గరకి వెళ్ళింది.
ఈ సినిమాకు సంబంధించి వేణు విజన్కి దిల్ రాజు పెద్ద పీట వేస్తూ..తనకి పూర్తిగా స్వేచ్ఛని కల్పించినట్లు తెలుస్తోంది. ఎల్లమ్మ అనే పేరుతో.. తెలుగు నేటివిటీని కళ్ళకు కట్టినట్లు చూపించాలని వేణు ఫిక్స్ అయ్యాడట.
తెలంగాణలో మహిళలకు ఇలాంటి పేరు ఎక్కువగా ఉంటుంది. అలాగే ఎల్లమ్మ గ్రామ దేవతగా పిలుస్తుంటారు. అలాంటిది వేణు తన రెండో సినిమాకి 'ఎల్లమ్మ' టైటిల్‌గా పెట్టడం మరింత ఆసక్తికరంగా మారింది.