బాలయ్య కెరీర్‌‌‌‌లో గుర్తుండిపోయేలా డాకు మహారాజ్ : బాబీ

బాలయ్య  కెరీర్‌‌‌‌లో గుర్తుండిపోయేలా డాకు మహారాజ్ : బాబీ

బాలకృష్ణ హీరోగా బాబీ కొల్లి రూపొందించిన  చిత్రం డాకు మహారాజ్.  సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన  ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి12న విడుదలవుతోంది. ప్రమోషన్స్ స్పీడ్ పెంచిన మేకర్స్.. మంగళవారం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా దర్శకుడు బాబీ మాట్లాడుతూ మొదటి నుంచి బాలకృష్ణ గారిని కొత్తగా చూపించాలనే ఉద్దేశంతో, ప్రతి విషయంలో వైవిధ్యం చూపిస్తూ ఎంతో జాగ్రత్తగా ఈ సినిమాని రూపొందించాం. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌‌కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమా విజయంపై మాకు మరింత నమ్మకం పెరిగింది.  అలాగే ‘డాకు మహారాజ్’ చిత్రం రాబోయే రోజుల్లో పలు సినిమాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని బలంగా నమ్ముతున్నా. 

బాలకృష్ణ గారి అభిమానులకు ఒక మెమొరబుల్ ఫిల్మ్ ఇవ్వాలనేది నాగవంశీ గారి డ్రీమ్. అందుకు తగ్గట్టుగానే సరికొత్తగా సినిమా ఉంటుంది. యాక్షన్‌‌తో  పాటు కామెడీ, ఎమోషన్స్‌‌తో ఫ్యామిలీ ఆడియెన్స్ మెచ్చేలా ఉంటుంది’ అని చెప్పాడు. ఈ చిత్రంలో గుర్తుండిపోయే మంచి పాత్రను పోషించానంది హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్. తన కెరీర్‌‌‌‌లో ఈ సినిమా స్పెషల్‌‌గా నిలుస్తుందని ఇందులో కీలక పాత్ర చేసిన శ్రద్ధా శ్రీనాథ్ చెప్పింది.  నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ ‘తెలుగుతో పాటు తమిళంలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నాం. ప్రేక్షకులను  అసలు నిరాశపరచదు. బాలకృష్ణ గారి కెరీర్‌‌‌‌లో గుర్తుండిపోయే సినిమాల్లో ఒకటిగా నిలుస్తుంది’ అని అన్నారు. బాబీ డియోల్, ఊర్వశీ రౌతేలా, చాందిని చౌదరి ఇతర ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి తమన్ సంగీతం 
అందిస్తున్నాడు.