టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి, నందమూరి నటసింహం బాలకృష్ణ టాప్ హీరోలుగా కొనసాగుతున్నారు. అప్పట్లో ఈ హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటేచాలు ఫ్యాన్స్ నానా హంగామా చేసేవారు. అయితే అప్పట్లో ఇప్పటిమాదిరిగా ఫ్యాన్ వార్లు, నెగిటివ్ ట్రోలింగ్ వంటివి లేవు. కానీ బాక్సాఫీస్ వద్ద మాత్రం పెద్ద పోటీ ఉండేది. గత 50 ఏళ్లుగా ఈ ఇద్దరూ తమ ఫ్యాన్స్ ని ఎంతగానో అలరిస్తున్నారు. దీంతో ఈ ఇద్దరితో మల్టీస్టారర్ చిత్రం ప్లాన్ చేస్తే బాక్సాఫీస్ షేక్ అవ్వడం ఖాయం.
ప్రముఖ డైరెక్టర్ బోపయపాటి శ్రీను ఈ లెజెండరీ నటులతో మల్టీస్టారర్ చిత్రం తీయాలని ఉందని తన మనసులోని మాటని బయట పెట్టాడు. అంతేకాదు ఈ సినిమాకి "వారిద్దరే" అనే టైటిల్ కూడా అనుకుంటున్నట్లు తెలిపాడు. దీంతో మెగా, నందమూరి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. అయితే గతంలో నందమూరి బాలకృష్ణతో సింహా, లెజెండ్, అఖండ తదితర చిత్రాలు తీసి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు.
ALSO READ | పవన్ OG నుంచి పవర్ఫుల్ పోస్టర్.. విధ్వంసం తప్పదా..
ఈ 3 సినిమాలు బాలకృష్ణ కెరీర్ లోనే బిగ్ హిట్లు గా నిలిచాయి. ఇక బోయపాటి శ్రీను హీరో ఎలివేషన్లు, యాక్షన్ సన్నివేశాల మేకింగ్ విధానం వేరే లెవెల్ లో ఉంటుంది. చిరు లెజెండరీ యాక్టింగ్, బాలయ్య మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఇమేజ్ కి ఈ ఇద్దరి కలయికలో సినిమా పడితేమాత్రం బాక్సాఫీస్ బద్దలవ్వడంతోపాటూ ఇండస్ట్రీ రికార్డులు క్రియేట్ అవుతాయని కొందరు ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.
ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను డైరెక్ట్ చేస్తున్న అఖండ 2 చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. ఇక మెగాస్టార్ చిరంజీవి బింభిసార మూవీ ఫేమ్ మల్లిడి వశిష్ట డైరెక్ట్ చేస్తున్న విశ్వంభర చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. అయితే ఈ చిత్రం సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేశారు. కానీ షూటింగ్ పనులు పూర్తికాకపోవడంతో సమ్మర్ కి వాయిదా పడింది.