
2021లో యంగ్ హీరో వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన ఉప్పెన సినిమా సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమా దాదాపుగా రూ.75 కోట్ల పైగా కలెక్ట్ చేసింది. దీంతో ఈ సినిమాని తెరకెక్కించిన డైరెక్టర్ బుచ్చిబాబు సాన ఒక్క సినిమాతోనే ఏకంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో సినిమా తీసే అవకాశాన్ని దక్కించుకున్నాడు. బుచ్చి బాబు "బాపు" సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా వచ్చాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తన తండ్రి గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు.
తనకి తన తండ్రి అంటే చాలా ఇష్టమని తెలిపాడు. అయితే తన తాను సినిమాల్లోకి రావడం తన తండ్రికి అసలు ఇష్టం లేదని దాంతో ఎప్పుడైనా సినిమాలకి వెళ్లినా సరే కర్రతో చితకబాదే వాడని గుర్తు చేసుకున్నాడు. కానీ తాను తీసిన ఉప్పెన సినిమా రిలీజ్ తర్వాత సినిమా చూడటానికి థియేటర్ కి వెళ్లి గేటు దగ్గర సినిమా ఎలా ఉందంటూ అందరినీ అడిగి తెలుసుకునేవాడని చెప్పుకొచ్చాడు. సినిమా సూపర్ హిట్ అని చెప్పడంతో సంతోషంగా మురిసిపోయేవాడని ఎమోషనల్ అయ్యాడు.
అలాగే ఈసారి రామ్ చరణ్ తో తీస్తున్న సినిమా గురించి ఎవర్నీ అడగాల్సిన అవసరం లేదని కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని ధీమా వ్యక్తం చేశాడు. దీంతో చెర్రీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. రామ్ చరణ్ ఇటీవలే నటించిన గేమ్ ఛేంజర్ సినిమా పెద్దగా అలరించలేక పోయింది. దీంతో చెర్రీ ఫ్యాన్స్ తీవ్ర నిరాశకి గురయ్యారు. కానీ మంచి గ్రిప్పింగ్ స్టోరీతో బుచ్చిబాబు కచ్చితంగా హిట్ కొడతాడని కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.
Also Read:-రంగుల ‘పరదా’ చాటున అనుపమ పరమేశ్వరన్..
ఇక బాపు సినిమా విషయానికొస్తే ఈ నెల 21న థియేటర్స్ లో రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాలో బ్రహ్మాజీ, వెటరన్ హీరోయిన్ ఆమని, బలగం సుధాకర్ రెడ్డి, ధన్య బాలకృష్ణ, మణి ఏగుర్ల మరియు అవసరాల శ్రీనివాస్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కామ్రేడ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ పై రాజు మరియు సిహెచ్. భాను ప్రసాద్ రెడ్డి నిర్మించగా నూతన దర్శకుడు దయా దర్శకత్వం వహించాడు. కామెడీ అండ్ ఎమోషనల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన బాపు సినిమా ట్రైలర్ ఇటీవలే రిలీజ్ కాగా మంచి రెస్పాన్స్ వచ్చింది.