Idli Kadai: ధ‌నుష్‌ ఇడ్లీ కడాయ్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్.. మూవీ విశేషాలివే

Idli Kadai: ధ‌నుష్‌ ఇడ్లీ కడాయ్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్.. మూవీ విశేషాలివే

త‌మిళ స్టార్ న‌టుడు ధ‌నుష్‌(Dhanush), స్టార్ హీరోయిన్ నిత్యా మీనన్ (Nithya Menen) కాంబోలో వస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఇడ్లీ కడాయ్’(Idli Kadai). ఈ సినిమాని ధనుష్ డైరెక్ట్ చేస్తున్నాడు. తాజాగా ధనుష్ ఇడ్లీ కడై నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశాడు. పోస్టర్ ఆసక్తిగా ఉంది.

ఈ పోస్టర్ లో హీరో ధనుష్ తో పాటు విశాల్ 'పందెం కోడి' మూవీలో నటించిన రాజ్ కిరణ్ కనిపిస్తున్నాడు.అర్జున్ రెడ్డి ఫేమ్ హీరోయిన్ శాలినీ పాండే స్పెషల్ రోల్ లో నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

గ్రామీణ నేపథ్యంలో ఇడ్లీ కొట్టు పెట్టుకుని బ్రతికే జంటగా ధనుష్, నిత్యా మీనన్ కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ జంట 2022లో వచ్చిన ‘తిరు' మూవీలో నటించారు. ఈ మూవీకిగాను నిత్యా మీనన్కి నేషనల్ అవార్డు వరించింది. అలాగే ఈ మూవీలో 'మేఘం కరిగేనా..పిల్లో పిల్లో' సాంగ్ ఆడియన్స్కి ఎంతో సుపరిచితం. 

డైరెక్టర్‌‌‌‌‌‌‌‌గా ధనుష్‌‌‌‌కి ఇది నాలుగో మూవీ కాగా, హీరోగా 52వ సినిమా. డాన్ పిక్చర్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌పై ఆకాష్ భాస్కరన్ మొదటి ప్రాజెక్టుగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జీవీ ప్రకాష్​ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ సినిమాకి పనిచేయబోయే టెక్నీషియన్స్ వివరాలను మేకర్స్ త్వరలో వెల్లడించే అవకాశం ఉంది.