
బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్ హీరోగా నటించిన "ఛావా" బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ సినిమా ఫిబ్రవరి 14న రిలీజ్ కాగా ఇప్పటివరకూ దాదాపుగా రూ.255 కోట్లు కలెక్ట్ చేసింది. మహారాజ్ ఛత్రపతి శివాజీ తనయుడు శంభాజీ మహారాజ్ జీవితగాథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా కి థియేటర్స్ లో అమేజింగ్ రెస్పాన్స్ వస్తోంది.
ఈ సినిమా చూసిన చాలామంది ఎమోషనల్ అవుతూ వీడియోలు షేర్ చేస్తున్నారు. దీంతో మౌత్ టాక్ స్ప్రెడ్ అవ్వడంతో ఛావా సినిమాని తెలుగులో కూడా రిలీజ్ చేయాలంటూ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు చరిత్ర గురించి సోషల్ మీడియా, ఇంటర్ నెట్ లో తెగ వెతుకుతున్నారు.
ALSO READ | సినిమా ఇండస్ట్రీలో ప్లాన్ B లేకపోతే కష్టమంటున్న తెలుగు హీరోయిన్..
ఈ సినిమా డైరెక్టర్ దినేష్ విజన్ ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వూలో పాల్గొని ఈ సినిమాలోని హీరో పాత్రపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అయితే ఛావా సినిమాలోని శంభాజీ మహారాజ్ పాత్రకి మొదటగా హీరో మహేష్ బాబు ని తీసుకోవాలనుకున్నారట. అంతేకాదు మహేష్ ని కలసి స్టోరీని కూడా వినిపించినప్పటికీ మహేష్ పెద్దగా ఆసక్తి చూపలేదని దీంతో చివరికి విక్కీ కౌశల్ ని తీసుకున్నామని తెలిపాడు. దీంతో ఈ విషయం ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారింది.
ఒకవేళ మహేష్ కనుక శంభాజీ మహారాజ్ పాత్ర చేసి ఉంటే కచ్చితంగా పాన్ ఇండియా స్టార్ అయ్యేవాడని కొందరు ఫ్యాన్స్ అంటున్నారు. అలాగే మహేష్ కి టాలీవుడ్ లో ఉన్న క్రేజ్, శంభాజీ మహారాజ్ కి ఉన్న రీజినల్ క్రేజ్ మిక్సింగ్ కాంబినేషన్ లో సినిమా పడుంటే పక్కా రూ.1000 కోట్లు కొల్లగొట్టేదని మరికొందరు అంటున్నారు. అయితే మహేష్ గతంలో యానిమల్, జల్సా, పుష్ప, లీడర్, గజిని, ఇలా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్ని మిస్ చేసుకున్నాడు.
ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం మహేష్ బాబు టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ జక్కన్న ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న SSMB29 (వర్కింగ్ టైటిల్) సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో మహేష్ కి జోడిగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా నటిస్తున్నాడు. దాదాపు రూ.1,000 కోట్ల భారీ బడ్జెట్తో దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కెఎల్ నారాయణ SSMB 29 నిర్మిస్తున్నారు.