ఎస్టీపీపీ మూడో యూనిట్ నిర్మాణాన్ని పూర్తిచేయాలి : డైరెక్టర్ ఈ అండ్ ఎం సత్యనారాయణ

ఎస్టీపీపీ మూడో యూనిట్ నిర్మాణాన్ని పూర్తిచేయాలి : డైరెక్టర్ ఈ అండ్ ఎం సత్యనారాయణ

జైపూర్,వెలుగు: జైపూర్​ మండల కేంద్రంలోని సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్​లో నిర్మించనున్న 800 మెగావాట్ల మూడో యూనిట్ నిర్మాణాన్ని గడువులో పూర్తిచేయాలని డైరెక్టర్ ఈ అండ్ ఎం డి.సత్యనారాయణ రావు, డైరెక్టర్ ఆపరేషన్స్ ఎల్వీ సూర్యనారాయణ ఆదేశించారు. గురువారం ఎస్టీపీపీ అడ్మిన్ బిల్డింగ్​లో బీహెచ్ఈఎల్ సంస్థ ఈడీ వినోద్ జాకబ్ సామ్, ఎస్టీపీపీ ఇన్​చార్జి ఈడీ శ్రీనివాసులు, అధికారులతో సైట్ మీటింగ్ నిర్వహించారు.

మూడో యూనిట్ నిర్మాణానికి టెక్నికల్ రివ్యూస్, కన్​స్ట్రక్షన్ షెడ్యూల్, క్వాలిటీ, ఆడిట్, ప్రణాళికలు, బిల్లింగ్​పై చర్చించారు. యూనిట్ ​నిర్మించే ప్రదేశంలో సాయిల్​టెస్ట్,సైట్ మొబిలైజేషన్ వర్క్స్ వచ్చే నెల మొదటి వారంలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు, జీఎంలు సుభాని, సుబ్బారావు, సూర్యనారాయణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.