Anirudh,Goutham: మ్యూజిక్తో ఫిదా అయ్యేలా.. జెర్సీ డైరెక్టర్, అనిరుధ్ల మ్యాజిక్ అప్డేట్

Anirudh,Goutham: మ్యూజిక్తో ఫిదా అయ్యేలా.. జెర్సీ డైరెక్టర్, అనిరుధ్ల మ్యాజిక్ అప్డేట్

జెర్సీ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి (Goutham Thinnanuri) మరో కొత్త ప్రాజెక్ట్ను షురూ చేశారు. ఇప్పటికే ఈ మూవీకి మ్యాజిక్ (Magic) అనే టైటిల్ పోస్టర్ రిలీజ్ చేసి షూటింగ్ కూడా కంప్లీట్ చేసాడు. అయితే, 'మ్యాజిక్‌' అనే టైటిల్ పెట్టి.. తనదైన సాంగ్స్తో మ్యూజిక్ చేసే అనిరుధ్ బర్త్డే స్పెషల్గా స్పెషల్ అనౌన్స్ చేశారు మేకర్స్. 

ఇవాళ బుధవారం (అక్టోబర్ 16న) ఈ మూవీకి మ్యూజిక్ అందిస్తున్న లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ బర్త్ డే స్పెషల్గా రిలీజ్ డేట్ ప్రకటించారు. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 21న మ్యాజిక్‌ మూవీని వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయబోతున్నట్టు  నిర్మాతలు తెలిపారు. ఈ మేరకు ఆసక్తికరమైన ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.  

మ్యాజిక్ కథ విషయానికి వస్తే.. 

కాలేజీ ఫెస్ట్ కోసం సాంగ్ కంపోజ్ చేయాలని..ఓ నలుగురు కాలేజీ యూత్ చేసిన ప్రయత్నంగా ఈ మూవీ తెరెకెక్కినట్లు తెలుస్తోంది. అంతేకాదు అనిరుధ్ ఇచ్చిన స్వరాలూ..శంకర్ క్రియేట్ చేసిన బాయ్స్ మూవీలా మ్యాజిక్ ఉండేలా ప్లాన్ చేశాడట డైరెక్టర్. 

మ్యాజిక్ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించాయి. త్వరలో మ్యాజిక్ నుంచి సాంగ్స్ రిలీజ్ చేసే అవకాశం ఉంది. మరి వీరి మ్యాజిక్ ఎలా ఉంటుందో..ఒక పాట రిలీజ్ అయితే తెలుస్తోంది.

ఇకపోతే.. విజయ్ దేవరకొండతో డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో  VD12 చిత్రం రాబోతుంది. ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మళ్ళీరావా (Mallirava) జెర్సీ (Jersey) వంటి సినిమాల్లో సెన్సిబుల్  ఎమోషన్స్ ను చాలా అద్భుతంగా క్యారీ చేసిన దర్శకుడి నుంచి సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలున్నాయి.