Tollywood New Movies: నేడు షూటింగ్‌ షురూ చేసిన రెండు బడా సినిమాలు..అవేంటో లుక్కేయండి

Tollywood New Movies: నేడు షూటింగ్‌ షురూ చేసిన రెండు  బడా సినిమాలు..అవేంటో లుక్కేయండి

గుణ శేఖర్ యుఫోరియా:

రుద్రమదేవి, శాకుంతలం లాంటి కాస్ట్యూమ్ డ్రామాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తర్వాత దర్శకుడు గుణశేఖర్ (Gunasekhar) ఎలాంటి సినిమా చేయనున్నాడా అనే ఆసక్తి నెలకొంది.  ఈసారి ఆయన రూటు మార్చారు.  యూత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సోషల్ డ్రామా తెరకెక్కించబోతున్నారు.రీసెంట్ గా గుణ శేఖర్ తన కొత్త సినిమాకు ‘యుఫోరియా’ (Euphoria) అనే టైటిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫిక్స్ చేస్తూ, టైటిల్ లోగోను విడుదల చేశారు.

ఈ సినిమాని గుణ హ్యాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మేడ్ ఫిలిమ్స్ బ్యాన‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై నీలిమ గుణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవలే ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ కంప్లీట్ చేసుకున్న  ‘యుఫోరియా’ షూటింగ్‌ను గుణశేఖర్‌ షురూ చేశారు. నేడు ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభం కాగా త్వరలో ఈ సినిమాలో నటించబోయే  నటీనటులు, ఇతర టెక్నీషియన్స్ వివరాలు మేకర్స్ ప్రకటించనున్నారు. 

బెల్లంకొండ శ్రీనివాస్ #BSS11

బెల్లంకొండ శ్రీనివాస్ (Bellamkonda Srinivas).. హీరోకి ఉండాల్సిన క్వాలిటీస్ అన్నే ఉన్నప్పటికి ఎందుకో ఈ హీరో సక్సెస్ కాలేకపోతున్నాడు. మొదటి సినిమానే వీవీ వినాయక్ తో చేసి ఇండస్ట్రీలోకి భారీ ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా ఓ మోస్తరుగా బాగానే ఆడింది. కానీ, ఏంటో ఆ తరువాత చేసిన ఏ ఒక్క సినిమా కూడా సరిగా ఆడలేదు. అయినప్పటికి అవకాశాలు మాత్రం బాగానే రాబట్టుకున్నాడు. మధ్యలో వచ్చిన రాక్షసుడు సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. అది కూడా తమిళ్ రీమేక్ అవడం కారణంగా. 

తాజాగా ఈ బెల్లంకొండ హీరో కొత్త సినిమా షూటింగ్ షురూ చేశాడు.  #BSS11గా వర్కింగ్ టైటిల్ తో రానున్న ఈ సినిమా షూటింగ్ ను నేడు జూలై 1న ప్రారంభించారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన ఫొటోలను నిర్మాణసంస్థ పంచుకుంది. షైన్‌ స్క్రీన్స్‌ పతాకంపై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ సినిమాని చావు కబురు చల్లగా సినిమాని డైరెక్ట్ చేసిన కౌశిక్‌ పెగళ్లపాటి తెరకెక్కించనున్నారు. హారర్‌ మిస్టరీ కథాంశంతో ఇది రూపొందనుంది. ఇందులో శ్రీనివాస్ సరసన అనుపమ పరమేశ్వరన్‌ కనిపించనున్నారు. మరి ప్లాప్ డైరెక్టర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకోనుందో చూడాలి.

 

ప్రస్తుతం టైసన్ నాయుడు సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్నాడు ఈ హీరో. భీమ్లా నాయక్ వంటి సినిమాను తెరకెక్కించిన సాగర్ కే చంద్ర ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.