EuphoriaTheFilm: జానర్ మార్చిన డైరెక్టర్ గుణశేఖర్.. థ్రిల్ చేసేలా యుఫోరియా మూవీ గ్లింప్స్

EuphoriaTheFilm: జానర్ మార్చిన డైరెక్టర్ గుణశేఖర్.. థ్రిల్ చేసేలా యుఫోరియా మూవీ గ్లింప్స్

ఇటీవలే  స్టార్ బ్యూటీ సమంత(Samantha) హీరోయిన్ గా వచ్చిన శాకుంతలం(Shakunthalam) సినిమాతో భారీ డిజాస్టర్ను తన ఖాతాలో వేసుకున్నాడు దర్శకుడు గుణశేఖర్(Gunasekhar).ఈ సినిమా మినిమమ్ ఓపెనింగ్స్ని కూడా రాబట్టలేక బిగ్గెస్ట్ ఫ్లాప్ గా నిలిచింది. ఇక అప్పటి నుండి గుణశేఖర్ తరువాతి సినిమాపై అనేక వార్తలు ఇండస్ట్రీలో వైరల్ అవుతూనే ఉన్నాయి.

ఇందులో భాగంగానే.. రానాతో హిరణ్యకశ్యప సినిమాను చేస్తున్నాడనే వార్తలు వినిపించాయి. దాదాపు అదే కన్ఫర్మ్ అని అందరూ అనుకున్నారు. కానీ, అందరికీ షాకిస్తూ సరికొత్త సినిమాను మొదలుపెట్టాడు గుణశేఖర్. యుఫోరియా (Euphoria) టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీ షార్ట్‌ టైటిల్‌ వీడియో, పోస్టర్ రిలీజ్ చేయగా ఇప్పటికే నెట్టింట హల్ చల్ చేస్తోంది.

ALSO READ | డైరెక్టర్ గుణశేఖర్‌ 'ఒక్కడు' కాంబినేషన్‌తో వస్తున్నాడు.. హిట్ దక్కేనా !

తాజాగా యుఫోరియా మూవీ గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. గుణ శేఖర్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ సామాజిక అంశంతో ప్రతి అంశం పక్కాగా ప్లాన్ చేసి, ఈ సినిమా తెరకెక్కించినట్లు తెలుస్తోంది.

డ్రగ్స్ కి బానిసై లోకం మరిచేలా మత్తులో ఉన్న యువతను తట్టిలేపేలా.. అసలు లైఫ్ అంటే ఏంటో ఆలోచింపజేసేలా గ్లింప్స్ సాగింది. దీంతో ఈ ఫస్ట్ గ్లింప్స్ సినిమాపై మరిన్ని అంచనాలు పెంచేసింది. ఈ చిత్రంలో భూమిక చావ్లా కీలక పాత్రలో నటిస్తుంది.

గుణశేఖర్  విషయానికి వస్తే.. 

1997 లో గుణశేఖర్ దర్శకత్వం వహించిన బాల రామాయణం జాతీయ ఉత్తమ బాలల చిత్రంగా పురస్కారాన్ని అందుకోవడమే కాక రాష్ట్ర స్థాయిలో కూడా పలు నంది పురస్కారాలను అందుకుంది. అలాగే తన కెరీర్ లో ఎన్నో విభిన్నమైన చిత్రాలను తెరకెక్కించి స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు పొందాడు. అందులో భాగంగా ‘చూడాలని ఉంది’, మనోహరం, ‘ఒక్కడు’, అర్జున్,సైనికుడు,‘రుద్రమదేవి’ వంటి ఎన్నో గొప్ప సినిమాలను తెరకెక్కించారు.