టాలీవుడ్ లో దర్శకుడు గుణశేఖర్(Gunasekhar) కు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఆయన సినిమాకు సెపరేట్ ఫ్యాన్స్ కూడా ఉన్నారు. సినిమాను కమర్షియల్ హాగులతో నింపి ఆడియన్స్ మెస్మరైజ్ చేయడం ఈయన స్పెషాలిటీ. అలా వచ్చినవే చూడాలని ఉంది, ఒక్కడు, మృగరాజు వంటి సినిమాలు. ఇక మాస్ మహారాజ్ రవితేజతో చేసిన నిప్పు భారీ ప్లాప్ ఆయిన తరువాత కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్న గుణశేఖర్ ఆ తరువాత నుండి తన స్టైల్ మార్చారు.
అప్పటివరకు కమర్షియల్ సినిమాలు చేస్తూ వచ్చిన ఆయన రుద్రమదేవి సినిమాఠీ హిస్టారికల్ సినిమాలు చేయడం మొదలుపెట్టారు. అనుష్క ప్రధాన పాత్రలో వచ్చిన ఈ సినిమా రూ.100 కోట్ల కలెక్ట్ చేసి సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా తరువాత మరోసారి హిస్టారికల్ కాన్సెప్ట్ శాకుంతలంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు గుణశేఖర్. 2013లో స్టార్ బ్యూటీ సమంత హీరోయిన్ గా వచ్చిన ఈ సినిమా భారీ పరాజయాన్ని చవిచూసింది. నిర్మాతలకు భారీ నష్టాలు తెచ్చిపెట్టింది.
శాకుంతలం ప్లాప్ తరువాత కాస్త గ్యాప్ తీసుకున్న గుణశేఖర్ తన నెక్స్ట్ సినిమా కోసం కూడా మరోసారి హిస్టారికల్ బ్యాక్డ్రాప్ నే ఎంచుకున్నారట. మన దేశంలో ఉన్న జీవనదుల్లో గంగా నదికి చాలా ప్రత్యేకత ఉంది. మహా శివుడి జటాజూటాల నుండి భువికి దిగివచ్చిన గంగా నదికి ఒక ప్రత్యేకమైన కథ ఉంది. ఇప్పుడు ఆ కథనే సినిమాగా తీయనున్నారట గుణశేఖర్. ఈ విషయంపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. మరి మరోసారి చారిత్రాక కథతో వస్తున్న గుణశేఖర్ ఎలాంటి విజయాన్ని అందుకోనుందో చూడాలి.