
తెలుగులో పలు రీమేక్ సినిమాలతో హిట్ కొట్టి అలరించిన ప్రముఖ డైరెక్టర్ హరీష్ శంకర్ గురించి కొత్తగా పరిచయం చెయ్యాల్సిన అవసరం లేదు. ఐతే హరీష్ శంకర్ 2006లో ప్రముఖ హీరో మాస్ మహారాజా రవితేజ హీరోగ నటించిన "షాక్" అనే సినిమాతో ఇండస్ట్రీకి డైరెక్టర్ గా పరిచయమయ్యాడు. ఆ తర్వాత గబ్బర్ సింగ్, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, దువ్వాడ జగన్నాథం, గద్దలకొండ గణేష్ తదితర సినిమాలతో మంచి హిట్లు అందుకున్నాడు. అయితే ఇటీవలే హరీష్ శంకర్ పుట్టిన రోజు కావడంతో ఓ ఇంటర్వూలో మాట్లాడుతూ పిల్లల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
తమది మధ్యతరగతి కుటుంబమని దీంతో తన చెల్లి, తమ్ముడిని కష్టపడి చదివించి వారికి ఇష్టమైన రంగాల్లో సెటిల్ చెయ్యాలనుకున్నామని అందుకే తాను, తన భార్య పిల్లలని కనకూడదనుకున్నామని తెలిపాడు. అలాగే పిల్లలు కలిగిన తర్వాత స్వార్థం మొదలవుతుందని దీంతో ఈ ప్రభావం తన చెల్లి, తమ్ముడి లైఫ్ పై పడే అవకాశం కూడా ఉంటుందని తాము పిల్లల్ని వద్దనుకోవడానికి ఇది కూడా ఒక కారణమని చెప్పుకొచ్చాడు.
►ALSO READ | గ్రేట్ కదా.. రూ.3 కోట్లు ఇస్తామంటే.. ఛీ పొమ్మన్నారు : బెట్టింగ్ యాప్స్ పై మధుమిత
అయితే పిల్లలు వద్దనుకున్న నిర్ణయంతో తన భార్య కూడా ఏకీభవించిందని అందుకే సక్సెస్ ఫుల్ గా, హ్యాపీ గా లైఫ్ లీడ్ చేస్తున్నామని, నిజంగా అలాంటి భార్య దొరకడం తన అదృష్టమని ప్రసంశలు కురిపించాడు. ఇక సోషియల్ అండ్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ లేకపోతే ఒత్తిడి లేకుండా పని చెయ్యవచ్చని అభిప్రాయం వ్యక్తం చేశాడుదేశ ప్రధాని నేరేడ్న్రా మోడీకి పిల్లలు, ఫ్యామిలీ లేకపోవడం వల్లే సమాజ సేవ చెయ్యగలుగుతున్నారని ఉదాహరణగా తెలిపాడు. ఈ విషయంపై నెటిజన్లు స్పందిస్తూ పెళ్లయిన కొన్ని రోజలుకే ఫ్యామిలీని వదిలేసి సెపెరేట్ అవ్వాలనుకునే ఈ జెనెరేషన్ లో తమ్ముడు, చెల్లి లైఫ్ కోసం పిల్లల్ని కూడా వద్దనుకున్న అన్న, వదినలు దొరకడం రియల్లీ గ్రేట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఈ విషయం ఇలా ఉండగా డైరెక్టర్ హరీష్ శంకర్ ప్రస్తుతం "ఉస్తాద్ భగత్ సింగ్" అనే సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో ప్రముఖ స్టార్ హీరో, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తుండగా యంగ్ బ్యూటి శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.