పవన్ పాత్రపై క్లారిటీ ఇచ్చిన హరీష్

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా వస్తుందంటే చాలు ఫ్యాన్స్ కు కిక్కే కిక్కు. ఆయన సినిమా ఎప్పుడు ప్రారంభం అవుతుంది ? ఆయన పక్కన నటించే హీరోయిన్ ఎవరు ? అనే దానిపై దృష్టి పెడుతుంటారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చే సినిమాపై కూడా ఫోకస్ పెట్టారు. కానీ.. ఆయన ఏ పాత్ర పోషిస్తారనే దానిపై తెగ చర్చించుకున్నారు. సోషల్ మీడియాలో ఆయన పాత్రపై పుకార్లు షికారు చేశాయి. వీటన్నింటికీ చెక్ పెట్టారు హరీష్. ఆయన పాత్ర ఎమిటో.. షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారనే దానిపై క్లారిటీ ఇచ్చేశారు. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ గా ఉన్నారు. వీరిద్దరి కాంబోలో ‘భవదీయుడు భగత్ సింగ్’ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. చిత్రానికి సంబంధించి ఇంట్రెస్టింగ్ ఒక న్యూస్ బయటకు వచ్చింది.

ఈ చిత్రంలో ఆయన ఎలాంటి పాత్ర పోషిస్తారనే దానిపై దర్శకుడు హరీశ్ శంకర్ క్లారిటీ ఇచ్చారని వార్తలు వెలువడుతున్నాయి. ఓ జాతీయ మీడియాతో ఈ సినిమా విశేషాలను పంచుకున్నారు. ‘భవదీయుడు భగత్ సింగ్’ చిత్రం పూర్తిగా కమర్షియల్ ఎంటర్ టైనర్ గా ఉండనుందని, కాలేజీ బ్యాక్ డ్రాప్ లో సాగుతుందని వెల్లడించారు. తొలిసారి లెక్చరర్ పాత్రలో సందడి చేస్తారని.. అందమైన లుక్ లో పవన్ కనిపిస్తారని తెలిపారు. ఇక చిత్రీకరణ విషయంపై కూడా స్పందించారు. ఆగస్టు నుంచి హైదరాబాద్ లో షూటింగ్ స్టార్ట్ అవుతున్నట్లు... 80 శాతానికి పైగా షూటింగ్ ఇక్కడే కొనసాగుతుందని స్పష్టం చేశారు. 


హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందే ఈ సినిమాకు సంబంధించి అనౌన్స్ మెంట్ ఎప్పుడో వచ్చినా.. కరోనా కారణంగా సినిమా సెట్స్ పైకి వెళ్లలేదు. ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందోనని అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. హరీష్ దీనిపై చెప్పడంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వీరిద్దరి కాంబోలో ‘గబ్బర్ సింగ్’ ఎలాంటి హిట్ సాధించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు వచ్చే ‘భవదీయుడు’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పవన్ జన్మదినం సందర్బంగా ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు కూడా. ప్రస్తుతం పవన్ క్రిష్ దర్శకత్వంలో ‘హరి హర వీర మల్లు’ సినిమాలో నటిస్తున్నారు. జులై లోపు షూటింగ్ ను పూర్తి చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. 

మరిన్ని వార్తల కోసం : -

సర్కారు వారి పాట సినిమాతో మహేశ్ మరో రికార్డు


255 చెట్లకు ప్రాణప్రతిష్ట