పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Power star Pawan kalyan) హీరోగా వచ్చిన తీన్‌మార్(Teenmaar) సినిమా ఫ్లాప్ పై ఆ చిత్ర దర్శకుడు జయంత్ సి పరాన్జీ(Jayanth C.paranjee) షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఆ సినిమాలో త్రిష(Trisha Krishnan)కు పెళ్లి చేసి ఉండకూడదని చెప్పుకొచ్చాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ఈమేరకు ఆసక్తికరమైన కామెంట్స్ చేశాడు.
"తీన్‌మార్ సినిమా ఫ్లాప్ ఐన సంగతి పక్కన పెడితే.. ఆ సినిమా నాకిప్పటికీ ప్రెష్ లవ్ స్టోరీగానే అనిపిస్తుంది. అయితే ఎందుకు ఈ సినిమా ఫ్లాప్ అయిందో కారణాలు నేను చెప్పలేను కానీ.. పవన్ ఫ్యాన్స్ కొంత మంది నిరాశకు గురయ్యారు. మరీ ముఖ్యంగా సోనూసూద్(Sonu Sood)తో, త్రిషకు వివాహం చేయడాన్ని వాళ్ళు జీర్ణించుకోలేకపోయారు. ఇక మళ్ళీ ఆమె తిరిగి పవన్ వద్దకు రావడం కూడా ప్రేక్షకులకు నచ్చలేదు. ఈ సినిమాను ఒక యంగ్ హీరో చేసి ఉంటే ఫలితం వేరేలా ఉండేదేమో.' అని చెప్పుకొచ్చారు జయంత్ సి పరాన్జీ.
ఇక 2011లో వచ్చిన తీన్‌మార్ మూవీ బాక్సాఫీస్ దగ్గర పరాజయాన్ని చవిచూసింది. పవన్ కళ్యాణ్, త్రిష జంటగా వచ్చిన ఈ సినిమా.. లవ్ ఆజ్ కాల్ అనే సినిమాకు రీమేక్ గా వచ్చింది. ఈ సినిమాను దర్శకుడు జయంత్ సి పరాన్జీ తెరకెక్కించగా.. బండ్ల గణేష్(Bandla Ganesh) నిర్మించాడు.