యాదాద్రిలో సినీ దర్శకుడు కె.రాఘవేంద్రరావు

యాదాద్రి: యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారిని సినీ దర్శకుడు  కె.రాఘవేంద్రరావు దర్శించుకున్నారు. ఆలయంలో భక్తుల దర్శనాలు పునః ప్రారంభమైన తర్వాత ఆయన తొలిసారిగా యాదాద్రికి వచ్చారు. స్వామి వారి దర్శనం కోసం వచ్చిన కె.రాఘవేంద్రరావుకు ఆలయ అర్చకులు, వేద పండితులు ఆలయ సంప్రదాయం ప్రకారం స్వాగతం పలికారు. దర్శనం అనంతరం ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం చేశారు. స్వామి వారిని దర్శించుకుని పూజలు చేసిన కె.రాఘవేంద్రరావు..  కోటి కుంకుమార్చనలో పాల్గొన్నారు.