కళ్యాణ్ రామ్, విజయశాంతి పోటీపడి నటించారు

కళ్యాణ్ రామ్, విజయశాంతి పోటీపడి నటించారు

‘రాజా  చెయ్యి  వేస్తే’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన ప్రదీప్ చిలుకూరి.. దాదాపు పదేళ్ల గ్యాప్ తర్వాత   రూపొందించిన చిత్రం ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’.  కళ్యాణ్ రామ్, విజయశాంతి  తల్లీకొడుకులుగా నటించగా, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌పై అశోక్ వర్ధన్, సునీల్ బలుసు నిర్మించారు.  ఏప్రిల్ 18న సినిమా విడుదలకానున్న సందర్భంగా దర్శకుడు  ప్రదీప్ మాట్లాడుతూ ‘ఇదొక ఎమోషనల్ మూవీ. పెద్దలు మన బర్త్‌‌‌‌డేని సెలబ్రేట్‌‌‌‌ చేసినట్టుగానే,  మనం వారి బర్త్‌‌‌‌డేని  సెలబ్రేట్ చేయడం ఒక ఎమోషన్. అదే ఈ సినిమాలో చెప్పాలనుకున్నా.  

కథ విన్న  కళ్యాణ్ రామ్ గారు.. వైజయంతి పాత్రకు విజయశాంతి గారు ఒప్పుకుంటేనే సినిమా చేద్దాం అని క్లియర్‌‌‌‌‌‌‌‌గా చెప్పారు. తర్వాత విజయశాంతి గారికి కథ చెబితే.. ఆమె చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. తన పాత్రలో చిన్న కరెక్షన్స్ చెప్పారు. ఆ మార్పులు చేసిన తర్వాత సెట్స్‌‌‌‌కు వెళ్లాం.  విజయశాంతి గారు ఫైట్ సీక్వెన్స్ చాలా అద్భుతంగా చేశారు. ఒకరోజు  జ్వరం ఉన్నప్పటికీ  సీన్ కంప్లీట్ చేసేవరకు సెట్‌‌‌‌ నుంచి కదల్లేదు.  అంత డెడికేటెడ్‌‌‌‌గా వర్క్ చేశారు.  ఆమె అనుభవం ఈ సినిమాకి చాలా హెల్ప్ అయ్యింది. కళ్యాణ్ రామ్ గారు విజయశాంతి గారు పోటీపడి యాక్ట్ చేశారు.   

కళ్యాణ్ రామ్ గారిని చాలా రోజుల తర్వాత పవర్‌‌‌‌‌‌‌‌ఫుల్ రోల్‌‌‌‌లో చూస్తారు. తల్లి కోసం ఎంత త్యాగం అయినా చేయొచ్చు అనేలా ఆయన చేసిన పెర్ఫార్మెన్స్ అందర్నీ ఆకట్టుకుంటుంది.  సయీ మంజ్రేకర్, సోహైల్ ఖాన్, పృథ్వి పాత్రలకు కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఎన్టీఆర్ గారు సినిమా చూసిన తర్వాత వచ్చిన కాన్ఫిడెన్స్‌‌‌‌తోనే క్లైమాక్స్ గురించి మాట్లాడారు. టీమ్ అంతా సినిమాపై కాన్ఫిడెంట్‌‌‌‌గా ఉన్నాం. ప్రొడ్యూసర్స్  హ్యాపీగా ఉన్నారు. యూవీ క్రియేషన్స్‌‌‌‌లో ఓ మూవీ, అనిల్ సుంకర గారి బ్యానర్‌‌‌‌‌‌‌‌లో ఓ మూవీ చేయాల్సి ఉంది’ అని చెప్పాడు.