బ్యాక్ డోర్ అనే చిత్రంతో నంది అవార్డును అందుకున్న దర్శకుడు కర్రి బాలాజీ.. ‘డర్టీ లవ్ ‘ అనే మరో సందేశాత్మక చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. A2B ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రంజిత్ రావు ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌ను నిర్మిస్తున్నారు. ఈతరం యువత పబ్బులు, రేవ్ పార్టీలు, ప్రైవేట్ రూమ్‌లు అంటూ జల్సాలు, విలాసాలతో పాటు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ ఎలా మత్తులో తూగుతోందో తెలిపే కథతో ఈ చిత్రం తెరకెక్కిస్తున్నామని దర్శకుడు తెలియజేశాడు.
స్క్రిప్ట్ వర్క్ ఇప్పటికే పూర్తి కాగా, ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని, త్వరలోనే కొత్త వాళ్లను హీరోహీరోయిన్స్‌గా ఫైనల్ చేసి త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తామని నిర్మాత వెల్లడించారు.