మాస్ మహారాజ్ రవితేజ(RaviTeja), దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని(Karthik Ghattamaneni) కాంబోలో వచ్చిన లేటెస్ట్ మూవీ ఈగల్(Eagle). అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran), కావ్య థాపర్(Kavya Thapar) హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాలో నవదీప్, అవసరాల శ్రీనివాస్ తదితరులు కీ రోల్స్ లో కనిపించారు. ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు ఆడియన్స్ నుండి మిక్సుడ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ కలెక్షన్స్ మాత్రం గట్టిగానే రాబడుతోంది ఈ మూవీ.
ఈగల్ మూవీకి మిక్సుడ్ టాక్ వచ్చినప్పటికీ.. దర్శకుడు కార్తీక్ ఘట్టమనేనికి మాత్రం మంచి మార్కులే పడుతున్నాయి. సినిమాలో తన స్టైలీష్ వర్క్ తో మెస్మరైజ్ చేశాడు కార్తీక్. ఇక యాక్షన్ సీక్వెన్స్ అయితే నెక్స్ట్ లెవల్లో డిజైన్ చేశాడు. హాలీవుడ్ రేంజ్ లో ఉన్న యాక్షన్ సీక్వెన్స్ కు ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. ఒక పెద్ద హీరో తనపై పెట్టిన నమ్మకాన్ని నెక్స్ట్ లెవల్లో ప్రూవ్ చేసుకున్నాడు కార్తీక్. నెవర్ బిఫోర్ అవతారంలో రవితేజ విశ్వరూపాన్ని చూపించాడని ఆడియన్స్ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో టాలీవుడ్ మేకర్స్ ఈ దర్శకుడితో సినిమాలు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
అయితే ఈగల్ సినిమా రిలీజ్ సందర్బంగా ఇంటర్వ్యూలో పాల్గొన్న కార్తీక్ తన తరువాతి సినిమా గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈగల్ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న కార్తీక్.. తన తరువాతి సినిమాను హనుమాన్ సినిమాతో సూపర్ హీరోగా మారిపోయిన తేజ సజ్జతో ప్లాన్ చేస్తున్నాడట. త్వరలోనే ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన రానుందని తెలిపాడు. ఈగల్ లాగే నెక్స్ట్ సినిమా కూడా భారీగానే ఉంటుందని, తేజ సజ్జతో సరికొత్తగా వచ్చి ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేస్తానని చెప్పుకొచ్చాడు కార్తీక్. దీంతో ఈ కాంబోలో వస్తున్న సినిమాపై ఆసక్తి నెలకొంది.