Anjali: అంజలితో లవ్ ఎఫైర్ పై క్లారిటీ ఇచ్చిన తెలుగు డైరెక్టర్. ఎవరేమనుకున్నా ఐ డోంట్ కేర్ అంటూ....

Anjali: అంజలితో లవ్ ఎఫైర్ పై క్లారిటీ ఇచ్చిన తెలుగు డైరెక్టర్. ఎవరేమనుకున్నా ఐ డోంట్ కేర్ అంటూ....

తెలుగు రాష్ట్రాల నుంచి ఇండస్ట్రీకి వచ్చి ఆఫర్లు దక్కించుకోలేక ఇతర సినిమా పరిశ్రమలకి వెళ్లి సెటిల్ అయినవారిలో ప్రముఖ హీరోయిన్ అంజలి ఒకరు.. అయితే అంజలి ఇటీవలే ప్రముఖ విలక్షణ దర్శకుడు శంకర్ డైరెక్ట్ చేసిన గేమ్ ఛేంజర్ లో హీరో రామ్ చరణ్ భార్య పాత్రలో నటించింది.. అయితే ఈ సినిమా అంజలికి కెరీర్ బ్రేక్ ఇస్తుందనుకుంటే పెద్దగా వర్కౌట్ కాలేదు.. అయితే నటి అంజలి తెలుగు ప్రముఖ డైరెక్టర్ కోన వెంకట్ తో ప్రేమలో పడిందని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నరని సోషల్ మీడియాలో పలు రూమర్స్, గాసిప్స్ బలంగా వినిపిస్తున్నాయి.. దీంతో ఈ విషయంపై దర్శకుడు కోన వెంకట్ స్పందించాడు.

ఇందులో భాగంగా నటి అంజలితో ప్రేమ, పెళ్లి, డేటింగ్ వంటి విషయాలపై వినిపిస్తున్న రూమర్స్, గాసిప్స్ లో ఎలాంటి నిజం లేదని క్లారిటీ ఇచ్చాడు.. అయితే నటి అంజలి లైఫ్ లో తీవ్ర విషాదం దాగుందని తన బాల్యం నుంచి ఇండస్ట్రీలో కెరీర్ వరకూ ఎన్నో బాధలు, కష్టాలు అనుభవించిందని చెప్పుకొచ్చాడు. అన్నదమ్ములు ఉన్నప్పటికీ పట్టించుకోలేదని దీంతో కొందరు బంధువులు అంజలికి సంబందించి ఆస్తులు కబ్జా చేశారని ఆ సమయంలో కోర్టులు, పోలీస్ స్టేషన్ వ్యవహారాల్లో ఆమెకి అండగా నిలబడ్డానని తెలిపాడు.. 

ALSO READ | Malavika Mohanan: "ఆర్ యూ వర్జిన్.?" అని అడిగిన నెటిజన్.. దాంతో స్టార్ హీరోయిన్ కి మండి ఏకంగా..

అయితే అంజలికి తాను ఇతరులు ఫ్రెండ్, కూతురి, తండ్రి, గురువు, దైవం, ఇలా ఎలా అనుకున్నా తనకి ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశాడు.. ఇక ఇతరులు తమ గురించి ఏమనుకున్నా "ఐ డోంట్ కేర్" అని, తమ మధ్య మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని  క్లారిటీ ఇచ్చాడు.. అయితే గతంలో అంజలి తన సొంత డబ్బుతో కొన్న కారుని తనపై ఉన్న అభిమానంతో నా చేతులమీదుగా ఓపెన్ చేయించిందని దీంతో కొందరు అసలు వాస్తవం తెలుసుకోకుండా ఏవేవో తప్పుడు ప్రచారం చేశారని ఇక అప్పటినుంచి అంజలి విషయంలో వినిపించే వాటిని పెద్దగా పట్టించుకోనని చెప్పుకొచ్చాడు.. 

ఈ విషయం ఇలా ఉండగా డైరెక్టర్ కోన వెంకట్ గత ఏడాది "గీతాంజలి మళ్ళీ వచ్చింది" అనే సినిమాతో ఆడియన్స్ ముందుకొచ్చాడు.. కానీ సినిమా పెద్దగా వర్కౌట్ కాలేదు. ప్రస్తుతం రైటర్ గా మరో స్ట్రాంగ్ కాన్సెప్ట్ తో ఆడియన్స్ ని అలరించేందుకు సిద్దమవుతున్నట్లు సమాచారం.