Kona Venkat: అందుకే నాగార్జున కింగ్ సినిమా ఫ్లాప్ అయ్యింది..

Kona Venkat: అందుకే నాగార్జున కింగ్ సినిమా ఫ్లాప్ అయ్యింది..

Kona Venkat: తెలుగులో ప్రముఖ డైరెక్టర్ శ్రీనువైట్ల, స్టార్ హీరో నాగార్జున కాంబినేషన్ లో 2008లో "కింగ్" అనే సినిమా రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో నాగార్జున డబుల్ యాక్షన్ పాత్రలో కనిపించగా త్రిష హీరోయిన్ గా నటించింది. అలాగే మమతా మోహన్ దాస్, దీపక్, సునీల్, బ్రహ్మానందం, శ్రీహరి, చంద్రమోహన్, గీత తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు.

స్టార్ మ్యూజిక్ డైరెక్టర్  దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించగా కామాక్షి మూవీస్ బ్యానర్ పై డి. శివప్రసాద్ రెడ్డి నిర్మించాడు. ఈ సినిమాకి స్టోరీ అందించిన ప్రముఖ స్టోరీ రైటర్, డైరెక్టర్ కోన వెంకట్ ఇటీవలే ఓ ఇంటర్వూ లో కింగ్ సినిమా ఫ్లాప్ అయిన విషయంపై స్పందించాడు.

ALSO READ | విజయ్ దేవరకొండ VD12 లో హీరోయిన్ గా యంగ్ బ్యూటీ.. ?

ఇందులో భాగంగా కింగ్ సినిమా ఫస్ట్ హాఫ్ బాగానే ఉన్నప్పటికీ సెకెండాఫ్ లో ఓవర్ స్ట్రెచింగ్ ఎలిమెంట్స్ కారణంగానే ప్లాఫ్ అయ్యిందని తెలిపాడు. అలాగే సెకెండాఫ్ లో ఫ్లో బట్టి కాకుండా అనవసరమైన సీన్స్ యాడ్ చేయడం వలన స్టోరీపై పట్టు తప్పి ఈ ప్రభావం సినిమా రిజల్ట్ పై పడిందని చెప్పుకొచ్చాడు. 

ముఖ్యంగా సెకెండాఫ్ లోని బొట్టు శ్రీను, కింగ్ క్యారెక్టర్లు అనవసరమైన కన్ఫ్యూజన్ క్రియేట్ చేశాయని తెలిపాడు. దీనికితోడు నెరేషన్ బాగున్నపటికీ స్క్రీన్ ప్లే బాగలేకపోవడంతో సినిమా ఫ్లాప్ అయ్యిందని అభిప్రాయం వ్యక్తం చేశాడు. అయితే కింగ్ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ బ్రహ్మానందం, నాగార్జున మధ్య సాగే కామెడీ సన్నివేశాలు ఆడియన్స్ ని బాగానే ఆకట్టుకున్నాయి. దీంతో ఇప్పటికీ సోషల్ మీడియాలో మీమ్స్ రూపంలో కనిపిస్తుంటాయి. ఇక పాటలు కూడా ఫర్వాలేదనిపించాయని చెప్పవచ్చు.

ఈ విషయం ఇలా ఉండగా డైరెక్టర్ కోన వెంకట్ గీతాంజలి మళ్ళీ వచ్చింది అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. కా కాగా ఈ సినిమాలో ప్రముఖ హీరోయిన్ అంజలి, శ్రీనివాస్ రెడ్డి, సునీల్, సత్యం రాజేష్ తదితరులు నటించారు. హర్రర్ కామెడీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా ఆడియన్స్ ని పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.