దేవర ఫస్ట్ ఛాయిస్ ఎన్టీఆర్ కాదా..? ఆ హీరో రిజెక్ట్ చేశాడా..?

దేవర ఫస్ట్ ఛాయిస్ ఎన్టీఆర్ కాదా..? ఆ హీరో రిజెక్ట్ చేశాడా..?

తెలుగులో ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దేవర చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో దేవర పార్ట్ 1 సెప్టెంబర్ 27వ తారీఖున భారీ అంచనాల నడుమ విడుదల కాబోతోంది. 

అయితే దేవర చిత్ర స్క్రిప్ట్ మొదటగా టాలీవుడ్ ప్రముఖ హీరో అల్లు అర్జున్ దగ్గరికి వెళ్లిందని ఈ క్రమంలో కొరటాల శివ అల్లు అర్జున్ కి దేవర స్టోరీ వినిపించినప్పటికీ బన్నీకి నచ్చలేదని దాంతో ఎన్టీఆర్ కి వినిపించగా ఒకే చెప్పాడని పలు పుకార్లు సోషల్ మీడియాలో బలంగా వైరల్ అవుతున్నాయి. 

దీంతో కొరటాల శివ ఈ పుకార్లకు చెక్ పెట్టాడు.  ఇందులో భాగంగా అల్లు అర్జున్ కి తాను వినిపించింది దేవర స్క్రిప్ట్ కాదని, అది వేరే స్క్రిప్ట్ అని స్పష్టం చేశాడు. అలాగే దేవర ఫస్ట్ అండ్ లాస్ట్ ఛాయిస్ అంటూ ఏదీ లేదని కేవలం ఎన్టీఆర్ ని దృష్టిలో ఉంచుకుని కథ రాశానని తెలిపాడు.

ఇక దేవర కోసం దాదాపుగా 4 గంటల స్టోరీని ముందే సిద్ధం చేసుకున్నానని అందుకే రెండు భాగాలుగా తెరకెక్కించాలని నిర్ణయించుకున్నామని చెప్పుకొచ్చాడు. దేవర  చిత్రం ఇంటర్వెల్ మరియు క్లైమాక్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయని తెలిపాడు. 

ఈ విషయం ఇలా ఉండగా దేవర చిత్ర టికెట్లు విడులా చెయ్యగా కొన్ని చోట్ల క్షణాల వ్యవధిలోనే హౌజ్ ఫుల్ అయిపోతున్నాయి. అంతేకాకుండా ఓవర్సీస్ లో దేవర చిత్ర విడుదలకి ముందే  ప్రీ సేల్స్ లో ఇప్పటికే రూ.10 కోట్లకి పైగా వసూళ్లు సాధించింది.