రాడిసన్ హోటల్ డ్రగ్ కేసు విచారణలో కీలక విషయాలు బయటపడ్డాయి. మరో ఇద్దరిని నిందితులగా గుర్తించారు నార్కోటిక్ బ్యూరో. వారిపై కేసు కూడా నమోదు చేశారు. A11గా వివేకానంద డ్రైవర్ ప్రవీణ్, A12 గా మీర్జా వహీద్ బేగ్ పేర్లను చేర్చారు. గత ఏడాది నుండి నిందితుడు వివేక్ డ్రగ్స్ కి అలవాటు పడ్డట్టు రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. రాడిసన్ హోటల్లో వివేకనంద తన స్నేహితులైన A10 డైరెక్టర్ క్రిష్, నిర్భయ్, సిందితో కలిసి డ్రగ్స్ తీసుకున్నట్టు గుర్తించారు.
ఈ నెల 24న రాడిసన్ హోటల్ లో జరిగిన డ్రగ్స్ పార్టీలో డైరెక్టర్ క్రిష్ పాల్గొన్నారు. డ్రగ్స్ పార్టీలో శ్వేత, లిసి, నీల్, సందీప్, డైరెక్టర్ క్రిష్ కూడా కొకైన్ తీసుకున్నారని పోలీసులు గుర్తించారు. డ్రగ్స్ పార్టీ జరిగిన ప్రతి సారి కూడా రాడిసన్ హోటల్ లోనే డైరెక్టర్ క్రిష్, నిర్భయ్ కలుసుకున్నట్లు గుర్తించారు. పెడ్లర్ సయ్యద్ అబ్బాస్ అలీ మీర్జా వహీద్ బేగ్ నుండి 1 గ్రాము కొకైన్ ను 14 వేలకు కొనుగోలు చేసినట్టు పోలీసుల విచారణలో తేలింది.
ప్రస్తుతం రఘుచరణ్, క్రిష్ ల ఫోన్లు స్విచ్చాఫ్ వస్తుండగా.. రఘు చరణ్ బెంగళూరు, క్రిష్ ముంబైలో ఉన్నట్లు సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆదారంగా గుర్తించారు పోలీసులు. మొత్తం పరారీలో 7మంది నింధితుల ఉన్నట్టు తెలుస్తుంది. వారందరి కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.