krishna vamsi: ఇండస్ట్రీలో అనాథను అయిపోయా.. కన్నీళ్లు పెట్టుకున్న కృష్ణవంశీ

krishna vamsi: ఇండస్ట్రీలో అనాథను అయిపోయా.. కన్నీళ్లు పెట్టుకున్న కృష్ణవంశీ

దర్శకుడు కృష్ణ వంశీ(Krishna vamsi) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఫ్యామిలీ కథలకు గ్లామర్ టచ్ ఇచ్చి సినిమాలు చేయడం ఆయన ఆయన తరువాతే ఎవరైనా. అందుకే ఆయన్ని క్రియేటీవ్ డైరెక్టర్ అంటారు. అయితే గత కొన్నేళ్లుగా కృష్ణ వంశీ తన ఫామ్ లో కోల్పోయారు. ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క సినిమా కూడా విజయాన్ని సాదించలేదు. అందుకే కొంతకాలంగా ఆఫర్స్ లేక సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నాడు. 

తాజాగా ఓ ఈవెంట్ లో పాల్గొన్న ఆయన వెక్కి వెక్కి ఏడ్చాడు. ఇండస్ట్రీలో తాను అనాథను అయ్యాను అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ప్రస్తుతం దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకు అసలు విషయం ఏంటంటే.. ఇటీవల ప్రముఖ గేయరచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి సందర్బంగా ఓ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ లో భాగంగా కృష్ణ వంశీ మాట్లాడుతూ.. సిరివెన్నెల శాస్త్రి గారితో 1989 నుంచి పరిచయం ఉంది. ఆయనలాంటి ఒక వ్యక్తి మనకు దొరకడం మహా అదృష్టం. ఎలాంటి అర్హత లేకపోయినా నన్ను తన కొడుకుగా స్వీకరించారు. ఎక్కువగా వాళ్ళ ఇంట్లోనే ఉండేవాణ్ణి. ఆయన ఉన్నప్పుడు నాకు చాలా ధైర్యంగా ఉండేది. గత కొన్ని నెలల నుండి సినిమా స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నా కానీ.. పాటలు ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఒక రకంగా చెప్పలాంటే అనాథను అయిపోయాను అంటూ.. కన్నీళ్లు పెట్టుకున్నారు కృష్ణ వంశీ.