ఖడ్గం సినిమాలో ఆ హీరో ప్లేస్ లో నాగార్జున ని తీసుకోవాలనుకున్నారా..?

ఖడ్గం సినిమాలో ఆ హీరో ప్లేస్ లో నాగార్జున ని తీసుకోవాలనుకున్నారా..?

తెలుగులో ప్రముఖ డైరెక్టర్ కృష్ణవంశీ డైరెక్ట్ చేసిన ఖడ్గం సినిమా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ఈ చిత్రంలో సీనియర్ హీరో శ్రీకాంత్, మాస్ మహారాజా రవితేజ, సంగీత, ప్రకాష్ రాజ్, సోనాలి బింద్రే, ఉత్తేజ్ తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు. ఈ చిత్రాన్ని రిలీజియస్ మరియు యాక్షన్ డ్రామా బ్యాక్ డ్రాప్ లోతెరకెక్కించగా టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. 

ఖడ్గం చిత్రం కమర్షియల్ గా, అలాగే మ్యూజికల్ గా మంచి హిట్ అయ్యింది. అయితే ఇవ్వాళ (అక్టోబర్ 18) ఖడ్గం చిత్రాన్ని థియేటర్లలో రీ-రిలీజ్ చేశారు. డైరెక్టర్ కృష్ణవంశీ ఖడ్గం చిత్రం గురించి పలు ఆసక్తికర విషయాలని ప్రేక్షకులతో పంచుకున్నాడు.

ఈ చిత్రంలో హీరో శ్రీకాంత్ నటించిన పోలీస్ ఆఫీసర్ పాత్రలో మొదటగా టాలీవుడ్ ప్రముఖ స్టార్ హీరో నాగార్జున ని నటింపజేయాలని నిర్మాతలు చెప్పారని తెలిపాడు. కానీ సీరియస్ లుక్స్ ఉన్న పాత్రకి నాగార్జునకంటే శ్రీకాంత్ బాగా సెట్ అవుతాడని అలాగే గతంలో నాగార్జునతో రెండు చిత్రాలు చెయ్యడంతో ఈసారి డిఫరెంట్ గా ట్రై చెయ్యాలని నిర్మాతలని ఒప్పించినట్లు కృష్ణవంశీ వెల్లడించారు. ఇక నాగార్జున కమర్షియల్ ఎలిమెంట్స్ కి ఈ చిత్రంలోని పాత్ర సరిపోదని  దీంతో ఈ ప్రభావం సినిమా రిజల్ట్స్ పడే అవకాశాలు ఉన్నాయని ముందే జాగ్రత్త పడినట్లు తెలిపాడు.

ALSO READ | Veekshanam Review: 'వీక్షణం' మూవీ రివ్యూ.. ఇండియాలో పక్కనోడి పనిమీదే అంతా.. ఆసక్తిగా సస్పెన్స్ థ్రిల్లర్

అయితే శ్రీకాంత్ తన పాత్రకి నూటికి నూరు శాతం న్యాయం చేశాడని చెప్పవచ్చు. ఒక పక్క సీరియస్ లుక్ లో కనిపిస్తూనే మరోపక్క పాస్ట్ లవ్ స్టోరీలో అద్భుతంగా నటించాడు. అందరూ సమిష్టిగా కృషి చెయ్యడంవల్లే  ఖడ్గం చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇప్పటికీ ఇండిపెండెన్స్ డే ఆగస్టు 15న జెమినీ ఛానెల్ లో ప్రసారం చేస్తుంటారు.