కత్రీనా, విక్కీ కౌశల్ భార్యాభర్తలుగా సెట్ అవరు.. డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్

కత్రీనా, విక్కీ కౌశల్ భార్యాభర్తలుగా సెట్ అవరు.. డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్

విక్కీ పక్కన కత్రినా కైఫ్ భార్యగా సెట్ కాదు అంటూ కామెంట్ చేశాడు బాలీవుడ్ డైరెక్టర్ లక్ష్మణ్ ఉటేకార్. ఆయన తాజాగా తెరకెక్కిస్తున్న సినిమా జరహట్ కే జరబచ్ కే. ఈ సినిమాలో విక్కీ కౌశల్ అండ్ సారా అలీ ఖాన్ జంటగా నటించాడు. ఈ సినిమా జూన్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో భాగంగా విలేకరుల సమావేశం నిర్వహించారు చిత్ర యూనిట్. 

ఈ ప్రెస్ మీట్ లో ఒక విలేఖరి ఆసక్తికర ప్రశ్న అడిగాడు.. ఎలాగూ విక్కీ కౌశల్, హీరోయిన్ భార్యాభర్తల్లా నటించాలి కదా అలాంటప్పుడు విక్కీకి జంటగా తన భార్య కత్రినానే తీసుకుంటే సరిపోయేది కదా అని అడిగాడు. దానికి సమాధానంగా డైరెక్టర్ లక్ష్మణ్ ఉటేకార్.. "కత్రినాని ఈ సినిమాలో హీరోయిన్ గా తీసుకనే చాన్సే లేదు. ఎందుకంటే ఫారన్ రిటర్న్ అయిన కత్రినా.. ఎక్కడైనా ఇండియన్ మిడిల్ క్లాస్ భార్యగా కనిపిస్తుందా? అసలు క్రతినా మిడిల్ క్లాస్ అమ్మాయిలా కనిపిస్తుందా? 

అందుకే ఈ సినిమాలో విక్కీ పక్కన కత్రినా భార్యగా సరిపోదు. పర్సనల్ గా వారిద్దరూ బ్యూటిఫుల్ కపుల్ అయినా ఈ కథలో మాత్రం భార్య భర్తల్లా సెట్ అవలేరు. ఈ సినిమాకి టిపికల్ మిడిల్ క్లాస్ లుక్ ఉన్న అమ్మాయి కావాలని సారా అలీఖాన్ ని సెలక్ట్ చేసుకున్నాను అని తెలిపారు. దీంతో ఈ డైరెక్టర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.