లియో సీక్వెల్ పై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్.. ఏమన్నాడంటే.?

లియో  సీక్వెల్ పై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్.. ఏమన్నాడంటే.?

తమిళ్ లో ప్రముఖ హీరో విజయ్ హీరోగా నటించిన లియో సినిమా హిట్ అయ్యింది. అయితే ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్, అర్జున్, త్రిష తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు. ఈ సినిమాకి తమిళ్ ప్రముఖ డైరెక్టర్ లోకేష్ కనకారాజ్ దర్శకత్వం వహించాడు. 

సెవెన్ స్టూడియోస్ బ్యానర్ పై తమిళ్ ప్రముఖ సినీ నిర్మాతలు లలిత్ కుమార్, జగదీష్ పళనిసామి కలసి సంయుక్తంగా నిర్మించారు. కాగా లియో రిలీజ్ అయిన రోజు మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ విజయ్ కి ఉన్న క్రేజ్ కి దాదాపుగా రూ.650 కోట్లు కలెక్ట్ చేసింది. దీంతో ఈ సినిమా సీక్వెల్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 

అయితే డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ లియో 2 పై స్పందించాడు. ఇందులోభాగంగా హీరో విజయ్ తో కలసి పని చేయడం నాకు సంతోషంగా ఉందని తెలిపాడు. అయితే ప్రజెంట్ పాలిటిక్స్ లో బిజీగా ఉన్నాడని, ఒకవేళ విజయ్ ఒప్పుకుంటే కచ్చితనంగా లియో 2 ఉంటుందని క్లారిటీ ఇచ్చాడు. 

కానీ హీరో విజయ్ ఇటీవలే తమిళగ వెట్రి కళగం అనే పార్టీ ని స్థాపించి తమిళ్ పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. అలాగే ప్రస్తుతం ప్రముఖ డైరెక్టర్ హెచ్. వినోద్ డైరెక్ట్ చేస్తున్న విజయ్ 69 సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన తర్వాత సినిమాలకి గుడ్ బై చెప్పి పాలిటిక్స్ లో కంటిన్యూ అవ్వాలని ప్లాన్ చేస్తున్నాడు. దీన్నిబట్టి చూస్తే లియో 2 లేనట్లే తెలుస్తోంది.