లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj)..ఆడియన్స్కు ఈ పేరు వింటే..ఏదో మ్యాజిక్..అదేదో తెలియని స్ట్రాంగ్ ఫీలింగ్ కలుగుతుంది. అందుకు కారణం లేకపోలేదు..లోకేష్ తెరకెక్కించిన నగరం మూవీ నుంచి మొన్నటి లియో వరకు ఆడియన్స్లో ఒక గట్టి నమ్మకాన్ని ఇచ్చారు.తీసింది కేవలం ఐదు సినిమాలే కానీ, క్రియేట్ చేసిన ఇంపాక్ట్ మాత్రం నెక్స్ట్ లెవల్ అనే చెప్పాలి. సినిమా ఇండస్ట్రీలో తన సినిమాలకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్ను క్రియేట్ చేసుకున్నాడు లోకేష్.
ఆయన తెరకెక్కించిన ఖైదీ, మాస్టర్, విక్రమ్ సినిమాలు అయితే మరో ఎత్తు. ఈ సినిమాలతో లోకేష్ అంటే ఇది అనేలా ఒక సిగ్నేచర్ క్రియేట్ చేసేశాడు. దీంతో లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ అనేది కూడా ఫ్యాన్స్ ఫాలో అయ్యేలా చేశాడు. ఇందులో భాగంగా వచ్చిన విజయ్ (Vijay) లియో సినిమా సీక్వెల్పై కూడా భారీ హోప్స్ ఉన్నాయి.
ఇదిలా ఉంటే లియో రిలీజై (19 October 2023) నేటికీ ఏడాది కంప్లీట్ (1YearOfLeo) అవ్వడంతో లోకేష్ ట్వీట్ చేశాడు. "లియో తో చాలా అభ్యాసాలు, చాలా జ్ఞాపకాలు, చాలా ఉత్తేజకరమైన క్షణాలు.. ఎప్పటికీ నా హృదయానికి దగ్గరగా ఉండే సినిమా లియో. ఈ సినిమా తెరకెక్కిలా చేసినందుకు ఎప్పటికీ నిన్ను చాలా ప్రేమిస్తుంటాను దళపతి విజయ్.. ఈ సినిమా కోసం తమ కష్టాన్ని గుర్తించి సక్సెస్ ఇచ్చిన ప్రేక్షకులకు ఎప్పటికీ కృతజ్ఞతలు" అంటూ తెలిపారు. దీంతో ఈ ట్వీట్ కి సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అంతేకాకుండా లియో 2 రాబోతుంది అంటూ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు.
ALSO READ | కార్తిక్ ఆర్యన్ భూల్ భూలైయా 3 మూవీ .. వరల్డ్ వైడ్ నవంబర్ 1 విడుదల
అయితే.. లేటెస్ట్ బజ్ ప్రకారం.. లియో సీక్వెల్ రాబోయే రోజుల్లో కచ్చితంగా ఉంటుందని, అయితే దానికి చాలా సమయం పడుతుందని ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో డైరెక్టర్ లోకేష్ చెప్పాడు. ప్రస్తుతం హీరో విజయ్ ఆలోచనలు వేరే మార్గంలో ఉన్నాయని, అతనికి సక్సెస్ రావాలని కోరుకుంటున్నట్లు లోకేష్ తెలిపారు. దీంతో విజయ్ ఫ్యాన్స్కు అదిరిపోయే న్యూస్ ఇచ్చాడని ఖుషి అవుతున్నారు. అదేంటీ? లియో అంతలా సక్సెస్ కాలేదు..అనుకున్నంత స్థాయిలో కథనం లేదని ఆడియన్స్ ఫీల్ అయ్యిన ఫ్యాన్స్కు ఎందుకు హ్యాపీగాఉన్నారంట..విజయ్ తిరిగి సినిమాల్లోకి రావడం కన్ఫర్మ్ అనే సమాచారం ఇవ్వడమే.
So many learnings, so many memories, so many exciting moments ❤️
— Lokesh Kanagaraj (@Dir_Lokesh) October 19, 2024
The film that will always stay close to my heart, #Leo 🔥🧊
Love you so much @actorvijay na for making it happen 🤗🤗❤️
Eternally grateful to all the people who have spent their sweat and blood for this film,… pic.twitter.com/nbcaKz1ptR
ఎందుకంటే విజయ్ ప్రస్తుతం తన 69వ సినిమా పూర్తి చేసి.. రాజకీయాల్లో క్రియాశీలకంగా మరలనుకుంటున్నాడు కానీ,లియో ఖచ్చితంగా ఉంటుందని లోకేష్ చెప్పడంతో..తమ ఫేవరేట్ హీరో వస్తుండటం పట్ల ఆడియన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మరి భవిష్యత్తులో ఏమవుతుందో చూడాలి.ఇకపోతే లోకేష్ సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) తో కూలీ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.