
దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన ‘నగరం’మూవీలో హీరోగా నటించిన శ్రీరామ్ నటరాజన్ తెలుగు, తమిళ ప్రేక్షకులకు సుపరిచితమే. కొంతకాలంగా నటుడు శ్రీరామ్ నటరాజన్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ ఉన్నాడు.
అయితే, ఇందులో తన పాత లుక్కి, ప్రసెంట్ ఉన్నదానికి చాలా తేడా ఉంది. ఈ క్రమంలో శ్రీరామ్కి ఏమైందంటూ.. రకరకాల ఊహాగానాలతో సోషల్ మీడియాలో నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
— Lokesh Kanagaraj (@Dir_Lokesh) April 18, 2025
తాజాగా నేడు శుక్రవారం (ఏప్రిల్ 18న) లోకేష్ కనగరాజ్ Xలో నోట్ రిలీజ్ చేశాడు. కొంతకాలంగా శ్రీరామ్ నటరాజన్పై వస్తోన్న ప్రశ్నలకు సమాధానాలినిస్తూ తన హెల్త్ అప్డేట్ ఇచ్చాడు. శ్రీరామ్ నటరాజన్ కుటుంబం పేరుతో ఈ నోట్ రిలీజ్ చేయబడింది.
"శ్రేయోభిలాషులు, స్నేహితులు మరియు మీడియా సభ్యులందరికీ మేము ఓ విషయం తెలియజేయాలనుకుంటున్నామ. నటుడు శ్రీరామ్ నిపుణులైన వైద్య సంరక్షణలో ఉన్నారని మరియు ప్రస్తుతం తన వైద్యుడి సలహాను అనుసరించి సోషల్ మీడియా నుండి కొంత సమయం తీసుకుంటున్నారని" అని ప్రకటనలో వెల్లడించారు. ప్రస్తుతం అతను కోలుకోవడంపై దృష్టి పెడుతున్నాడు.
ఈ క్రమంలో అతని గోప్యత అవసరాన్ని గౌరవించాలని మేము ప్రతి ఒక్కరినీ అభ్యర్థిస్తున్నాము. రకరకాల ఊహాగానాలతో, తప్పుడు సమాచారం వ్యాప్తి చేయకుండా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. త్వరలో శ్రీరామ్ కోలుకుని ఎప్పటిలాగే ప్రేక్షకుల్ని అలరిస్తాడు. అప్పటివరకు మీ నిరంతర ప్రేమ, మద్దతు ఉంచాలని ఆశిస్తున్నాం..ధన్యవాదాలు" అంటూ నోట్ లో వెల్లడించారు.