స్కిల్స్​ పెంచుకునేలా ట్రైనింగ్ : మంజుల శ్రీనివాసరెడ్డి

స్కిల్స్​ పెంచుకునేలా ట్రైనింగ్ : మంజుల శ్రీనివాసరెడ్డి

గోదావరిఖని, వెలుగు : స్టూడెంట్లు స్కిల్స్​పెంచుకునేలా ట్రైనింగ్​ఇవ్వాలని కృష్ణవేణి విద్యాసంస్థల డైరెక్టర్​ మంజుల శ్రీనివాసరెడ్డి అన్నారు. జిల్లాలోనే మొదటిసారిగా విద్యార్థులకు స్కిల్​ డెవలప్​మెంట్‌‌‌‌లో భాగంగా ఎస్​ ఫౌండేషన్​ ఫౌండర్, సైంటిస్ట్​ బి.మల్లేశం పర్యవేక్షణలో బుధవారం అడ్డగుంటపల్లిలోని కృష్ణవేణి టాలెంట్​ స్కూల్‌‌‌‌లో ఎల్‌‌‌‌ఈడీ బల్బు తయారీపై విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు. 

ఈ సందర్భంగా మంజుల మాట్లాడుతూ మేక్​ ఇన్​ ఇండియా, మేక్​ ఇన్​ తెలంగాణలో భాగంగా 2026-–27 నుంచి విద్యార్థులకు 27 టెక్నికల్​ కోర్సులలో శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో గోదావరిఖని ప్రెస్​ క్లబ్​జనరల్​సెక్రటరీ పందిళ్ల శ్యామ్‌‌‌‌సుందర్‌‌‌‌‌‌‌‌, ఎలక్ట్రానిక్​ మీడియా ప్రెసిడెంట్​ బైరం సతీశ్​, సెక్రటరీ సత్యనారాయణ, హెచ్‌‌‌‌ఎం రామకృష్ణ, రాజిరెడ్డి, సత్యనారాయణ, శైలజ, టీచర్లు పాల్గొన్నారు.