గోపీచంద్ హీరోగా కన్నడ దర్శకుడు హర్ష రూపొందించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘భీమా’. కె.కె.రాధామోహన్ నిర్మాత. మహా శివరాత్రి సందర్భంగా విడుదలైన ఈ చిత్రానికి ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోందని చెప్పారు మేకర్స్. ఈ సందర్భంగా శుక్రవారం టీమ్ థ్యాంక్స్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి హాజరైన దర్శకుడు మారుతి మాట్లాడుతూ ‘పరీక్షల సమయంలో, ఇన్ని సినిమాలు ఉన్నప్పటికీ కూడా ‘భీమా’ మంచి కలెక్షన్స్‌తో థియేటర్స్‌లో సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. దర్శకుడు హర్ష చాలా గ్రిప్పింగ్‌గా తీశారు.
క్లైమాక్స్ ఎపిసోడ్ ఈ సినిమాకి హైలైట్. అలాగే మంచి ఎంటర్‌టైన్‌మెంట్, యాక్షన్ ఉంది. అందరూ తప్పకుండా ఎంజాయ్ చేస్తారు’ అని చెప్పాడు. మరో దర్శకుడు సంపత్ నంది మాట్లాడుతూ ‘మైథాలజీ, ఫాంటసీ బ్లెండ్ చేసి ఇంత మంచి కమర్షియల్ సినిమా ఇచ్చిన గోపీచంద్ గారికి థ్యాంక్స్. ఇంటర్వెల్, క్లైమాక్స్ ఫైట్ చూస్తున్నపుడు పరశురాముడు అంటే ఇలానే ఉంటాడేమో అనిపించింది’ అని చెప్పాడు.
గోపీచంద్ మాట్లాడుతూ ‘ఇంత మంచి విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. సినిమాకి చాలా మంచి ప్రశంసలు వచ్చాయి. రెండు క్యారెక్టర్స్‌లో చక్కని వేరియేషన్స్ చూపించానని మంచి అప్లాజ్ వచ్చింది’ అని చెప్పాడు. ఈ సినిమాకి ముంబైలోనూ షోస్ అన్ని ఫుల్ అవుతున్నాయని చెప్పింది హీరోయిన్ మాళవిక శర్మ. సపోర్ట్ చేసి, సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్ చెప్పాడు దర్శకుడు హర్ష. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారని నిర్మాత చెప్పారు.