Director Maruthi: రాజాసాబ్ ఆలస్యమవుతుందా..మారుతి ఏమన్నారంటే!

Director Maruthi: రాజాసాబ్ ఆలస్యమవుతుందా..మారుతి ఏమన్నారంటే!

డార్లింగ్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న మూవీ రాజాసాబ్(Rajasaab). ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది ఈ సినిమా. ఇందులో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, ఆషికా రంగనాథ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.  కట్టప్ప సత్యరాజ్, బాలీవుడ్ స్టార్ యాక్టర్ సంజయ్ దత్ కీలక పాత్రలలో కనిపించబోతున్నారట. గతేడాది అక్టోబర్ లో మూవీ షూటింగ్ స్టార్ట్ అయ్యింది.

సలార్, కల్కి 2898 AD సినిమాలు సెట్స్ పై ఉండగానే రాజాసాబ్ షూటింగ్ కూడా మెదలెట్టేశారు. రెగ్యులర్ గా షూటింగ్ మాత్రం జరగడం లేదు. కల్కి 2898 ఏడీ కంప్లీట్ చేసిన తర్వాత రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయాలని ప్లాన్ చేసుకున్నారు. కల్కి మూవీ మేలో రిలీజ్ అవుతుందని చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో రాజాసాబ్ షూటింగ్ త్వరలో స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. షూటింగ్ మొత్తం ఒకే సెట్ లో ఉంటుంది కాబట్టి వీలైనంత వేగంగా కంప్లీట్ చేసే అవకాశం ఉంది.

అయితే సలార్ 2 మూవీ షూటింగ్ కూడా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఈ రెండింటిని మేనేజ్ చేస్తూ షెడ్యూల్స్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. తాజాగా ట్రూ లవర్ టీజర్ రిలీజ్ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా మీట్ లో రాజాసాబ్ పై మారుతి(Maruthi) ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ఈ సినిమా రిలీజ్ డేట్ని ఇప్పుడే కన్ఫర్మ్ చేసి చెప్పలేనని తేల్చేశాడు.

ఒకటి మాత్రం చెప్పగలను..మీకు ఇష్టమైన డేట్ లో మాత్రం సినిమా వచ్చే ఛాన్స్ ఉంది. దీనిని బట్టి ప్రభాస్ పుట్టినరోజు లేదంటే కృష్ణంరాజు జయంతి రోజున మూవీ రిలీజ్ అయ్యే అవకాశాలున్నాయనే ప్రచారం తెరపైకి వస్తోంది.