
ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్స్ రాజు సాబ్' కూడా ఒకటి. రొమాంటిక్ హారర్ జానర్లో మారుతి తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు.
ఏప్రిల్లోనే ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా అనుకోని కారణాలతో ఆలస్యమైంది. దీంతో రిలీజ్ డేట్ మొదలు అప్డేడేట్స్ వరకు అభిమానుల్లో క్యూరియాసిటీ నెలకొంది. తాజాగా తిరుపతి, శ్రీకాళహస్తి దర్శనానికి వెళ్లిన దర్శకుడు మారుతి... సోషల్ మీడియా ద్వారా అప్ డేట్స్ గురించి ఆరా తీస్తున్న అభిమానులకు బదులిచ్చారు.
చాలా పాజిటివ్ వైబ్స్ తో ఈ సినిమా తీస్తున్నామని, కొంతటాకీ పార్ట్, పాటలు మాత్రమే బ్యాలెన్స్ ఉందని చెప్పారు. పలు కంపెనీలు సీజీ వర్క్స్ చేస్తున్నాయని, కొన్ని సంస్థల నుంచి వచ్చే ఔట్పుట్ ఎగ్జిటింగ్ ఉందని సంతోషం వ్యక్తం చేశారు.
ఇతర స్టూడియోస్ నుంచి కూడా అదేస్థాయిలో ఔట్ పుట్ ఆశిస్తున్నామన్నారు. ఎంతోమంది శ్రమ ఇందులో ఇన్వాల్వ్ అవడంతో అనుకున్న సమయానికి కొంత ఆలస్యమవుతోందని, సీజీ వర్క్స్ పూర్తయ్యాక పీపుల్ మీడియా సంస్థ రిలీజ్ డేట్ ను ప్రకటిస్తుందని చెప్పారు.
అలాగేపాటల షూటింగ్ పూర్తయ్యాక ఒక్కో లిరికల్ సాంగ్ ను విడుదల చేస్తామన్నారు. ఇక ప్రస్తుతం 'ఫౌజీ' చిత్రం సూటింగ్తో బిజీగా ఉన్న ప్రభాస్.. స్పిరిట్, సాలార్ 2, కల్కి 2చిత్రాలు పూర్తి చేయాల్సి ఉంది.