
టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ మెహర్ రమేష్ సోదరి మాదాసు సత్యవతి గురువారం (మార్చి 27) అనారోగ్యతో తుది శ్వాస విడిచారు. అయితే సత్యవతి కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు. దీంతో ఇటీవలే హైదరాబాద్ లోని ఓ ప్రముఖ హాస్పిటల్ లో చేరి చికిత్స తీసుకుంటున్నారు. కానీ పరిస్థితి విషమించడంతో గురువారం కన్నుమూశారు. దీంతో డైరెక్టర్ మెహర్ రమేష్ ఇంట్లో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఈ విషయంపై ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. ఇందులోభాగంగా మెహర్ రమేష్ కుటుంబ సభ్యులకి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశాడు. అలాగే చదువుకునే రోజుల్లో వేసవి సెలవులు వచ్చినప్పుడు వారి ఇంటికి వెళ్లేవాళ్లం. రమేష్, సత్యవతి కుటుంబంలోని ఇతర సభ్యులతో కలిసి ఎంతో ఆనందంగా సమయం గడిపిన జ్ఞాపకాలు ఉన్నాయి. శ్రీమతి సత్యవతి గారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’ అని పవన్ కల్యాణ్ ఎక్స్ లో పేర్కొన్నాడు.
ఈ విషయం ఇలా ఉండగా డైరెక్టర్ మెహర్ రమేష్ ఇటీవలే మెగాస్టార్ చిరంజీవితో భోళా శంకర్ అనే సినిమాతో ఆడియన్స్ ముందుకొచ్చాడు. కానీ సినిమా పెద్దగా ఆకట్టుకోలేదు. దీంతో మరో మెగా హీరోతో సినిమా కోసం పవర్ఫుల్ స్క్రిప్ట్ ని రెడీ చేస్తున్నట్లు సమాచారం.
దర్శకులు శ్రీ @MeherRamesh గారి సోదరి శ్రీమతి మాదాసు సత్యవతి గారి మరణవార్త తీవ్ర బాధాకరం. వారి పవిత్రాత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.
— Deputy CMO, Andhra Pradesh (@APDeputyCMO) March 27, 2025
- @PawanKalyan pic.twitter.com/QjShqIyp6z