టాలీవుడ్ ప్రముఖ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డు లభించిన విషయం తెలిసిందే. అయితే ఆలు అర్జున్ కి పుష్ప : ది రైజ్ సినిమాకి ఈ అవార్డు దక్కింది. ఈ సినిమాలో అల్లు అర్జున్ ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే యుకుడి పాత్రలో నటించాడు. దీంతో ఇలాంటి పాత్రకి నేషనల్ అవార్డు ఇవ్వడమేంటని కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేశారు.
రీసెంట్ గా ఈ విషయంపై తెలుగు ప్రముఖ డైరెక్టర్ ఇంద్రగంటి మోహన్ కృష్ణ స్పందించాడు. ఇందులోభాగంగా అవార్డులు ఎప్పుడూ కూడా ప్రతిభనిబట్టి ఉంటాయి తప్ప పాత్రనిబట్టి కాదని అభిప్రాయం వ్యక్తం చేశాడు. అలాగే అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డు ఇవ్వడం సరైనదేనని సమర్థించాడు.
అయితే డబ్బుకోసం సినిమాలు తీసేవాళ్ళని ఎంకరేజ్ చెయ్యకూడదని కానీ టాలెంట్ ని నిరూపించుకునేవాళ్ళని అవార్డులతో సత్కరించడం మంచిదేనని చెప్పుకొచ్చాడు. అలాగే పుష్ప సినిమాలో అణగారిన వర్గాల నుంచి వచ్చిన యువకుడు అల్లు అర్జున్ తన నటనతో ఎక్కడా కూడా స్మగ్లర్ అనే విషయం గుర్తు రాకుండా కేవలం హీరోయిజంతో అలరించాడని రియల్లీ గ్రేట్ అని అన్నాడు. ఇక కమర్షియల్, ఆర్ట్ బేస్డ్ సినిమాలకి అవార్డులు సెపరేట్ గా ఉండవని టాలెంట్ నిరూపించుకున్నవారికి దక్కుతాయని చెప్పుకొచ్చాడు.
ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం ఇంద్రగంటి మోహన్ కృష్ణ ప్రముఖ హీరో, కమెడియన్ ప్రియదర్శి హీరోగా నటిస్తున్న సారంగపాణి జాతకం సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా ఫ్యామిలీ & కామెడీ జోనర్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో రూప కొడువాయూర్, నరేష్, తనికెళ్ల భరణి, అవసరాల శ్రీనివాస్, వెన్నెల కిషోర్, వైవా హర్ష, తదితరులు ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు.