సూపర్ హీరో పాత్రలో ప్రభాస్(Prabhas) చేస్తున్న లేటెస్ట్ మూవీ కల్కి 2898 AD(Kalki 2898AD). దర్శకుడు నాగ్ అశ్విన్(Nag Ashwin) తెరకెక్కిస్తున్న ఈ హై బడ్జెట్ స్కైఫై మూవీపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. ఇటీవల రిలీజైన కల్కి 2898 AD ఫస్ట్ గ్లింప్స్ కు ఆడియన్స్ నుండి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.
ఇక తాజాగా ఈ సినిమా నుండి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు చిత్ర దర్శకుడు నాగ్ అశ్విన్. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన కల్కి సినిమా గురించి మాట్లాడుతూ.. కల్కి 2898 ఏడీ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. మిగిలిన పార్ట్ కూడా త్వరలోనే కంప్లీట్ చేస్తాం. ఈ సినిమా కోసం ఓ కొత్త ప్రపంచాన్ని ఆవిష్కరిస్తున్నాం. ప్రభాస్ కూడా ఇంతకుముందెన్నడూ కనిపించని కొత్త అవతారంలో కనిపిస్తారు. సినిమా త్వరగా పూర్తి చేయాలనే తపనతోనే మేమెంతా ఉన్నాం. త్వరలోనే విడుదల తేదీ గురించి తెలియజేస్తాం అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం నాగ్ అశ్విన్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.
ఇక కల్కి 2898 AD సినిమా విషయానికి వస్తే.. వైజయంతీ మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత సి.అశ్వనీదత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అమితాబ్ బచ్చన్, కమల్‌హాసన్, దీపికా పాడుకొనే, దిశా పటాని వంటి స్టార్ యాక్టర్స్ నటులు ఈ సినిమాలో నటిస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.