Nag Ashwin: కల్కి సినిమాకు..ఆ హాలివుడ్ సినిమాలే కారణం..పాత్రలు కూడా!..నాగ్ అశ్విన్ ఏమ‌న్నాడంటే?

Nag Ashwin: కల్కి సినిమాకు..ఆ హాలివుడ్ సినిమాలే కారణం..పాత్రలు కూడా!..నాగ్ అశ్విన్ ఏమ‌న్నాడంటే?

ప్రస్తుతం ఇండియాలో ఎక్కడ చూసినా దర్శకుడు నాగ్ అశ్విన్ గురించే చర్చ నడుస్తోంది. కారణం..కల్కి 2898 AD. ప్రభాస్ హీరోగా వచ్చిన ఈ మూవీ అంతర్జాతీయ వైడ్ గా గుర్తింపు పొందింది. ఈ ఏడాది ఇండియ‌న్ సినిమాల్లో రూ.900 కోట్లకి పైగా వసూళ్లు చేసిన చిత్రంగా క‌ల్కి రికార్డ్ నెల‌కొల్పింది. 

ఈ సినిమాని తెరకెక్కించిన డైరెక్టర్ నాగ్ అశ్విన్ పై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి.విజువల్స్,గ్రాఫిక్స్ హాలీవుడ్ రేంజ్ లో ఉన్నాయని, దర్శకుని ఊహకు, దాన్ని స్క్రీన్ మీద ప్రెజెంట్ చేసిన విధానానికి టాప్ టెక్నీషియన్స్ సైతం ఫిదా అవుతున్నారు.ఇక ఇండియన్ మైథాలజీ బ్యాక్డ్రాప్ గా తీసుకొని దానికి ఫ్యూచరిస్టిక్ ఎలిమెంట్స్ యాడ్ చేసి సినిమా చేయడం అంటే మామూలు విషయం కాదు అంటూ పొగిడేస్తున్నారు.అయితే,ప్ర‌భాస్ క‌ల్కి హాలీవుడ్ (మార్వెల్ సినిమాల‌కు)కాపీ అంటో వ‌స్తోన్న వార్త‌ల‌పై తాజాగా నాగ్ అశ్విన్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు.కల్కి సినిమాని ఏ హాలీవుడ్ మూవీ నుంచి స్ఫూర్తి పొందుతూ తెర‌కెక్కించ‌లేద‌ని నాగ్ అన్నాడు.వివరాల్లోకి వెళితే..

క‌ల్కి సినిమాకోసం దాదాపు నాలుగేళ్లు రీసెర్చ్ చేసి కష్టపడి రాసుకున్న స్క్రిప్ట్ ఇది.ఐడియా డెవ‌ల‌ప్ చేసుకోవ‌డంలో హాలీవుడ్ మూవీస్ హెల్ప్ అయ్యాయి అంతే తప్ప..ఏ సినిమా నుంచి స్టోరీ,క్యారెక్ట‌ర్ల‌ను తాను కాపీ కొట్ట‌లేద‌ని స్ప్రష్టం చేశాడు. 

మార్వెల్ సినిమాల‌కు కాపీ!

నేను మార్వెల్ సినిమాల‌ను తరుచుగా చూస్తుంటాను.అయితే మార్వెల్ కంటే సూప‌ర్ హీరో జాన‌ర్‌లో వ‌చ్చిన గార్డియ‌న్ ఆఫ్ గెలాక్సీ,స్టార్ వార్స్ అంటే నాకు విపరీతమైన ఇష్టం.హిస్టారిక‌ల్‌,మైథ‌లాజీ నుంచి తెరకెక్కిన సినిమాలను స్ఫూర్తి పొంద‌తూ అందులోని సూప‌ర్ హీరో క్యారెక్ట‌ర్స్ కోసం రాసుకున్న తీరు నచ్చింది.అయితే, క‌ల్కి ఐడియాను డెవ‌ల‌ప్ చేసుకోవ‌డంలో ఆ సినిమాల‌పై ప్ర‌భావం నాపై కొంత ఉంది.కానీ,ఆ సినిమాలు ఓ రిఫ‌రెన్స్‌గా ఉప‌యోగ‌ప‌డ్డాయి అంతే త‌ప్పితే,వాటికి ప్రభాస్ కల్కి క‌థ‌కు ఎలాంటి సంబంధం లేదని నాగ్ అశ్విన్ వెల్లడించాడు. 

కమల్ పాత్ర ఒక్కొక్క‌రికి ఒక్కోలా...  

హారీ పోట‌ర్ మెయిన్ విల‌న్ వోల్డ్ మార్ట్ క్యారెక్ట‌ర్,లుక్‌ను కాపీ కొట్టి క‌ల్కిలో కమల్ హాసన్ పాత్రకు స్ఫూర్తిని పొందడాన్ని వ‌చ్చిన వార్త‌ల‌పై నాగ్ అశ్విన్ ఖండించాడు. 120 నుంచి 130 ఏళ్ల క్రితం నాటి టిబెట‌న్ మ‌త గురువుల (టిబెటన్ సన్యాసులు) లుక్‌ను రిఫ‌రెన్స్‌గా తీసుకొని క‌మ‌ల్ క్యారెక్ట‌ర్‌ను డిజైన్ చేసుకున్న‌ట్లు నాగ్ తెలిపారు. 

నేను సిద్ధం చేసిన లుక్ చూసి..గ్రే (ఆస్కార్ వైల్డ్ యొక్క 1890 తాత్విక నవల ది పిక్చర్ ఆఫ్ డోరియన్ గ్రే నుండి) ఓ ఇంగ్లిష్ న‌వ‌ల‌లో పాపుల‌ర్ అయిన డోరియ‌న్ గ్రేను పోలి ఉంద‌ని క‌మ‌ల్ హాసన్ అన్నారని గుర్తు చేశారు. ఇలా ఒక్కొక్క‌రికి ఆయ‌న పాత్ర ఒక్కోలా క‌నిపిస్తుంది. దీంతో కమల్ లుక్ ఏ సినిమా నుంచి స్ఫూర్తి పొందుతూ డిజైన్ చేసింది కాదని కన్ఫమ్ చేశాడు. 

ఇక కల్కి 2898 AD సినిమాని డెనిస్ విల్లెనెయువ్ యొక్క 2021 మూవీ డూన్‌తో కంపైర్ చేయడంపై నాగ్ స్పందిస్తూ..“సినిమా రాకముందు వరకు నేను డూన్ కథ చదవలేదు..నేను పెద్ద స్టార్ వార్స్ అభిమానిని కాబట్టి..ఏదో ఒక సిట్యువేషన్ ని మిక్స్ చేస్తున్నట్లు అర్థమైంది. బహుశా నేను అది చూసి ఉండాల్సింది" అని నాగ్ అశ్విన్ అన్నాడు.

భార‌తీయ పురాణాల‌కు గ్రాఫిక్స్‌, యాక్ష‌న్ హంగుల‌ను జోడించి నాగ్ అశ్విన్ తెరకెక్కించిన క‌ల్కి ఒక కళాఖండం అని ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వస్తుండగా..మధ్యలో ఇలాంటి రూమర్స్ కామన్ అంటూ ప్రభాస్ ఫాన్స్ రెస్పాన్స్ అవుతున్నారు.ఈ సినిమాలో భైర‌వ అనే సూప‌ర్ హీరోగా, క‌ర్ణుడిగా డ్యూయ‌ల్ షేడ్ క్యారెక్ట‌ర్‌లో ప్ర‌భాస్ క‌నిపించి ఆకట్టుకున్నాడు. ఇక ప్ర‌భాస్‌, బిగ్ బి అమితాబ్‌బ‌చ్చ‌న్ మ‌ధ్య వ‌చ్చే ఫైట్ సీక్వెన్స్‌ల‌ను థియేట‌ర్ల‌లో ఆడియెన్స్ తెగ ఎంజాయ్ చేస్తోన్నారు. మరో పది రోజుల్లో ఈ సినిమా రూ.1500 కోట్ల కలెక్షన్స్ కి చేరువలో ఉంది.