సుబ్రహ్మణ్యం ఇంపార్టెన్స్ ఇంకా పెరిగింది

సుబ్రహ్మణ్యం ఇంపార్టెన్స్ ఇంకా పెరిగింది

ఎవడే సుబ్రహ్మణ్యం’  ఒక లవ్ ఎటాచ్‌‌‌‌మెంట్ ఉన్న  అరుదైన సినిమా. పదేళ్లకు ముందు ఎంత రెలెవెంట్‌‌‌‌గా ఉండేదో ఇప్పటికీ  అంతే రెలెవెంట్‌‌‌‌గా ఉంటుందని భావిస్తున్నా’ అని దర్శకుడు నాగ్ అశ్విన్ అన్నారు. నాని, విజయ్ దేవరకొండ, మాళవిక నాయర్, రీతూ వర్మ లీడ్‌‌‌‌ రోల్స్‌‌‌‌లో ఆయన రూపొందించిన ఈ చిత్రం మార్చి 21కి పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా అదే రోజున రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా నాగ్ అశ్విన్ మాట్లాడుతూ ‘పదేళ్ల క్రితం ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు అదొక చిన్న రిలీజ్ అనే చెప్పాలి. 

అందరం కొత్త వాళ్ళం. నా ఫస్ట్ ఫిల్మ్. స్వప్న, ప్రియాంక కూడా అప్పుడప్పుడే వచ్చారు. నాని ఇంత మ్యాసీవ్ అవ్వలేదు. విజయ్ దేవరకొండ డెబ్యూ. ఆ సమ్మర్‌‌‌‌‌‌‌‌లో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి. ఈ సినిమా కూడా బాగా ఆడింది. వర్డ్ ఆఫ్ మౌత్ బాగుంది కానీ ఇప్పుడు రిలీజ్ అయితే వచ్చినంత రీచ్ అప్పుడు వచ్చిందని అనుకోవడం లేదు. ఒక పదేళ్ళ తర్వాత ఈ జనరేషన్ వాళ్లు కూడా ఈ సినిమాను చూసి ఎంతో కొంత బెనిఫిట్ పొందుతారనే ఆలోచన ఎప్పటినుంచో ఉండేది. 

ఎందుకంటే అప్పటికి ఇప్పటికి ప్రపంచం, మనుషులు ఏమీ మారలేదు. సుబ్బు పాత్ర ఇంకా పవర్‌‌‌‌ఫుల్ అయ్యాడనిపిస్తుంది. మనం ఇంకా అదే టార్గెట్స్ వైపు పరిగెడుతున్నాం. అవే గోల్స్ వెనుక పరిగెడుతున్నాం.  పదేళ్లకు ముందు ఎంత రెలెవెంట్‌‌‌‌గా ఉండేదో ఇప్పటికీ సినిమా అంతే రెలెవెంట్‌‌‌‌గా ఉంటుందని భావిస్తున్నా. సినిమాకి ఇంకా ఇంపార్టెన్స్ పెరిగింది. ఈ రిలీజ్‌‌‌‌లో మరింతమంది ఎక్స్‌‌‌‌పీరియెన్స్  చేస్తారని భావిస్తున్నా. దీనికి సీక్వెల్ చేయలేం కానీ.. ప్రీక్వెల్ రాయొచ్చు.  ఇక ‘కల్కి2’ ఈ ఇయర్ ఎండింగ్‌‌‌‌లో ఉండొచ్చు’ అని చెప్పారు.