అరి మూవీ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్ చేసిన డైరెక్టర్ నాగ్ అశ్విన్..

అరి మూవీ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్ చేసిన డైరెక్టర్ నాగ్ అశ్విన్..

వినోద్ వర్మ, సూర్య పురిమెట్ల, అనసూయ భరద్వాజ్, సాయి కుమార్, శ్రీకాంత్ అయ్యంగార్ ముఖ్యపాత్రల్లో రూపొందిన చిత్రం ‘అరి’. మై నేమ్ ఈజ్ నో బడీ అనేది ట్యాగ్‌‌లైన్. ‘పేపర్‌‌‌‌బాయ్‌‌’ ఫేమ్ జయశంకర్ దర్శకత్వం వహించాడు. శనివారం ఈ చిత్రం నుంచి ‘భగ భగ..’ అనే లిరికల్‌‌ సాంగ్‌‌ను విడుదల చేశారు. దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ పాటను విడుదల చేసి టీమ్‌‌కు బెస్ట్ విషెస్‌‌ చెప్పాడు. 

అనూప్ రూబెన్స్ కంపోజ్ చేసిన ఈ పాటను షణ్ముక ప్రియ, రోహిత్ పీవీఎన్ఎస్ పాడారు. ‘‘మనిషేనా నువ్వు, ఏమైపోతున్నావు, మృగమల్లె మారి దిగజారి పోయావు, భగ భగ భగ భగ మండే నీలో ఏదో సెగ, అంతులేని ఏంటీ దగా..’ అంటూ వనమాలి పవర్‌‌‌‌ఫుల్ లిరిక్స్ రాశారు. శ్రీనివాస్ రామిరెడ్డి, డా.తిమ్మప్ప నాయుడు పురిమెట్ల నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకురానుంది. 

రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్నాడు. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, మాస్ మూవీ మేకర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్‌‌‌‌టైన్‌‌మెంట్ బ్యానర్స్‌‌పై ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మిస్తున్నారు.  ఇప్పటికే షూటింగ్ పూర్తికాగా,  పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే రిలీజ్ డేట్‌‌ను అనౌన్స్ చేయనున్నారు.