కల్కి 2898 AD(Kalki 2898 AD).. ప్రస్తుతం ఇండియన్ సినీ ఇండస్ట్రీ ఈగర్ గా వెయిట్ చేస్తున్న సినిమా ఇది. అందుకే ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే చర్చ నడుస్తోంది. కథ, కథనం, స్టార్ కాస్ట్, బడ్జెట్, టెక్నాలజీ ఇలా ప్రతీ అంశంలో ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేస్తోంది ఈ మూవీ. అందుకే ఈ సినిమా గురించి వినిపిస్తున్న చిన్న న్యూస్ అయినా క్షణాల్లో ట్రేడింగ్ లోకి వస్తోంది.
నిజానికి కల్కి సినిమా మొదలైనప్పటి నుండి ఇది మన మైథాలజీకి లింక్ ఉంటుందనే ఉహాగానాలు వచ్చాయి. ప్రభాస్ ఈ సినిమాలో విష్ణు మూర్తి అవతారంలో కనిపిస్తానే వార్తలు కూడా వైరల్ అయ్యాయి. దీంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. అయినప్పటికి కల్కి సినిమా ఎలా ఉండబోతుంది అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ఆ ఆసక్తి మరింత పెరుగుతోంది. మేకర్స్ కూడా చిన్న చిన్న హింట్స్ ఇస్తూ.. సినిమాపై అంచనాలను పెంచుతున్నారు. తాజాగా కల్కి సినిమా గురించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ చెప్పారు.
అదేంటంటే ముందుగా అనుకున్నట్టుగానే కల్కి సినిమా హిందూ మైథాలజీకి లింకప్ ఉంటుందట. దర్శకుడు నాగ్ అశ్విన్ ఇటీవల సినాప్స్ అనే ఓ టెక్నాలజీ, మైథాలజీ ఇంటరాక్షన్ మీట్ కి హాజరయ్యారు. ఈ ఈవెంట్ లో ఆయన కల్కి సినిమా గురించి మాట్లాడుతూ.. కల్కి 2898 AD సినిమా మహాభారతం నుండి మొదలై 2898వ సంవత్సరంలో పూర్తవుతుంది. 6000 సంవత్సరాల మధ్య జరిగే కథ ఇది. అందుకే సినిమాకు కల్కి 2898 AD టైటిల్ ఫిక్స్ చేశాము. ఇండియన్ మైథాలజీ క్యారెక్టర్స్ ఆధారంగానే ఈ సినిమా తెరకెక్కుతోంది. భవిష్యత్తు ప్రపంచం ఎలా ఎలా ఉండబోతుందో ఊహించి ఒక కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేసాము.. అంటూ చెప్పుకొచ్చాడు. నాగ్ అశ్విన్ చేసిన ఈ కామెంట్స్ తో కల్కి సినిమాపై అంచనాలు రెట్టింపు అవుతున్నాయి.
ఇక కల్కి సినిమా మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. దాదాపు రూ.600 కోట్ల బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమాను వైజయంతి మూవీస్ నిర్మిస్తుండగా.. బిగ్ బి అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనె, దిశా పటాని ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మరి భారీ అంచనాల మధ్య వస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి వండర్స్ క్రియేట్ చేయనుందో చూడాలి.