Nag Ashwin: స్పెషల్ వీడియోని రిలీజ్ చేస్తూ..అమెరికన్‌ ఆడియన్స్‌కు థ్యాంక్స్‌ చెప్పిన నాగ్‌ అశ్విన్‌..ఎందుకంటే?

Nag Ashwin: స్పెషల్ వీడియోని రిలీజ్ చేస్తూ..అమెరికన్‌ ఆడియన్స్‌కు థ్యాంక్స్‌ చెప్పిన నాగ్‌ అశ్విన్‌..ఎందుకంటే?

ప్రభాస్‌ హీరోగా నాగ్‌ అశ్విన్‌ తెరకెక్కించిన ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తోంది. ఈ మూవీ ప్రభాస్ కెరియర్లో మరో బ్లాక్ బాస్టర్ గా నిలవనుంది.  కల్కి జూన్ 27న విడుదలైనప్పటి నుంచి బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్లతో దూసుకుపోతోంది. తాజాగా అమెరికన్‌ ఆడియన్స్‌కు డైరెక్టర్ నాగ్ అశ్విన్ (Nag Ashwin) కృతజ్ఞతలు చెప్పారు. ఓ ప్రత్యేక వీడియోని రిలీజ్ చేస్తూ..సినిమాను చాలా పెద్ద స్థాయిలో ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. 

‘మా నుంచి వచ్చే ప్రతి సినిమాకు అమెరికన్‌ ఆడియన్స్‌ ఎప్పుడు చాలా సపోర్ట్‌గా నిలుస్తు వస్తున్నారు. మంచి సినిమాకు అమెరికా  ఆడియన్స్ అండగా ఉంటారు. అందరికంటే ముందుగా ‘కల్కి’ని ఆదరించారు. వారి సొంత చిత్రంగా భావించి సపోర్ట్‌ చేస్తున్నారు. అలాగే మీ ఫ్రెండ్స్,రిలేటివ్స్ ని కూడా కల్కి ప్రపంచానికి తీసుకెళ్లండి. ఎందుకంటే ఇలాంటి సినిమాలు చాలా అంటే చాలా అరుదుగా వస్తుంటాయి. వీటిని థియేటర్స్ లో బిగ్‌స్క్రీన్‌పై చూస్తే వచ్చే ఆ ఆనందం లైఫ్ లో ఎప్పటికీ గుర్తుంటుంది. ఇప్పటికే థియేటర్లో చూసినవాళ్లు ఈ అద్భుతమైన ఎక్స్‌పీరియన్స్‌ చేసుంటారు’..థ్యాంక్యూ అమెరికా..త్వరలో మళ్ళీ కలుద్దాం" అంటూ కల్కిని సపోర్ట్‌ చేస్తున్నందుకు డైరెక్టర్ నాగ్‌ అశ్విన్‌ స్పెషల్ థ్యాంక్స్‌ చెప్పారు.

ఇక ఈ కల్కి మూవీ ప్రీ బుకింగ్స్ సేల్స్‌లోనే ఓవర్సీస్‌లో రికార్డులు క్రియేట్ చేసింది. లేటెస్ట్ గాకలెక్షన్స్ విషయంలో కూడా మరో ఘనత సాధించింది. నార్త్‌ అమెరికాలో అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ ఫిల్మ్ గా కల్కి నిలిచింది. ఇప్పటివరకు అక్కడ 11 మిలియన్‌ డాలర్లు వసూలు చేసి..ఫస్ట్ వీకెండ్ అదరగొట్టింది. ఇంత తక్కువ సమయంలో ఏ ఇండియన్ ఫిల్మ్ కి ఈ స్థాయి కలెక్షన్స్ రాలేదని కల్కి మేకర్స్ ప్రకటించారు. ప్రస్తుతం ఈ మూవీ వరల్డ్ వైడ్ గా రూ.555 కోట్ల క్లబ్‌లో చేరిపోయింది. ఇక రానున్న రోజుల్లో రూ. 1000 కోట్ల మార్కును కూడా చేరనుంది.